Begin typing your search above and press return to search.
దేశంలో కరోనా బీభత్సం .. ఒకే ఇంట్లో ముగ్గురు మృతి , ఆ కుటుంబంలో తీరని శోకం !
By: Tupaki Desk | 11 Sep 2020 12:10 PM GMTకరోనా దేశంలో రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. కరోనా మహమ్మారిని ఎంత కట్టడి చేయాలని అనుకుంటున్నా కూడా రోజురోజుకి భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఈ కరోనా మహమ్మారీ వల్ల కుటుంబాల్లో విషాదం నిండుకుంది. అంతకంతకూ విస్తరిస్తూ ప్రజలను పట్టిపీడిస్తోంది. ప్రాణాంతక వైరస్ సోకుతుందనే భయం వెంటాడటంతో కరోనా మృతులు సరైన పద్ధతిలో అంత్యక్రియలకు కూడా చేయలేకపోతున్నారు.ఇకపోతే , మంచిర్యాలలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు కరోనా కారణంగా ప్రాణాలు వదలగా .. కామారెడ్డి లో ఓ వృద్ధురాలు కరోనాతో మృతిచెందగా ఎవరూ ఆమె దగ్గరికి వెళ్లకపోవడంతో వైరస్ బారిన కుటుంబ సభ్యులే అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. మంచిర్యాలలో ప్రముఖ వ్యాపారి కుటుంబంపై మహమ్మారి విలయతాండవం చేసింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే తండ్రి, ఇద్దరు కొడుకుల ప్రాణాలను అపహరించింది. కరోనా మహమ్మారితో ముగ్గురూ మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు తీరని శోకంలో మునిగిపోయారు.
ఇక , మరో ఘటనలో .. కామారెడ్డి పట్టణం గోపాలస్వామి గుడిరోడ్డులో ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో ఇంట్లోని 80 ఏళ్ల వృద్దురాలు మృతి చెందింది. దీనితో వైద్య శాఖతో పాటు మున్సిపల్, రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇచ్చినా వారి నుంచి స్పందన కరువైంది. స్థానికులు, అధికారులతో తమ భాదను చెప్పుకున్నా ఒక్కరూ కనికరించలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో కరోనా బాధితులైన మృతురాలి మనవళ్లు స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి, తమ దుస్థితిని వివరించి మూడు పీపీఈ కిట్లు తెచ్చుకున్నారు. కిరాయికి ఆటోను మాట్లాడి మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కరోనా లాంటి మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మనుషులకి మనుషులు సహాయం చేయాల్సింది పోయి , ఇలా చేయడం మానవ జాతికి మంచిది కాదు.