Begin typing your search above and press return to search.
దేశంలో కరోనా బీభత్సం.. ఒక్కరోజే లక్ష కేసులు - 1100కి పైగా మరణాలు!
By: Tupaki Desk | 10 Sep 2020 7:00 AM GMTదేశంలో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతుంది. రోజురోజుకి పెరుగుతూనే ఉంది తప్ప ..తగ్గుముఖం పట్టడంలేదు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పుడు కరోనా జోరు ఎక్కువగా ఉన్న దేశం ఇండియానే. తాజాగా...శంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 95,735 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1172 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 44,65,864కు చేరుకుంది. ఇప్పటిదాకా 75,062 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 9,19,018కి చేరుకుంది. 34,71,784 మంది డిశ్చార్జి అయ్యారు.
కరోనా కేసులు , ఇదే స్థాయిలో కొనసాగితే అగ్రస్థానానికి దూసుకెళ్లడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. దేశంలో మరణాల్లోనూ ఉధృతి కొనసాగుతోంది. వరుసగా మూడోరోజు 1100 మందికి పైగా మరణించారు. కరోనా మరణాల్లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో కొనసాగుతోంది. 75,062 మంది ఇప్పటిదాకా మరణించారు. అమెరికా, బ్రెజిల్ తరువాత అత్యధిక మరణాలు నమోదైనది భారత్ లోనే. అమెరికాలో 1,95,239, బ్రెజిల్ లో 1,28,653 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.
కరోనా మరణాల్లో మెక్సికో నాలుగో స్థానంలో ఉంది. మెక్సికోలో కరోనా వల్ల 69,095 మంది మృత్యువాత పడ్డారు. ఏపీ సహా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ లల్లో కరోనా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రాల్లో భారీగా నమోదు అవుతున్న కొత్త కేసుల వల్ల దేశవ్యాప్తంగా లక్ష వరకు రోజువారీ లెక్కలు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 5,29,34,433 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజులో 11,29,756 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది.