Begin typing your search above and press return to search.

భారత్‌ లో కరోనా కల్లోలం ..కొత్తగా ఎన్నంటే ?

By:  Tupaki Desk   |   8 Sep 2020 7:10 AM GMT
భారత్‌ లో కరోనా కల్లోలం ..కొత్తగా ఎన్నంటే ?
X
భారత్ ‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. సెప్టెంబర్‌ లోకి రోజుకో కొత్త రికార్డు తరహాలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఏకంగా 80 వేల మార్క్‌ను దాటి.. 90 వేలకు చేరువయ్యాయి రోజువారీ కేసులు.. అయితే, పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గాయి. అయితే, మరణాలు మరింత పెరిగి ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్ ‌లో మరో 75,809 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో రికార్డు సంఖ్యలో 1,133 మంది మృతిచెందారు. వీటితో కలిపి ఇప్పటివరకు దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 42,80,423కు చేరుకోగా, ఇప్పటి వరకు 72,775 మంది మృతిచెందారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,83,697 యాక్టివ్ కేసులు ఉండగా... కరోనాబారినపడి ఇప్పటి వరకు 33,23,951 మంది కోలుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. మరోవైపు సోమవారం రోజు దేశ్యాప్తంగా 10,98,621 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు చేసిన టెస్ట్‌ల సంఖ్య 5,06,50,128కు చేరింది.

ఇక , తెలంగాణ‌లో క‌రోనా ఉద్ధృతి కొన‌సాగుతోంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,392 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,346 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,163కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,12,587మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 906కు చేరింది.

ఇక , ఏపీలోనూ ఈ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 8,368 కొత్త కేసులు రావడంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఇప్పటివరకు ఏపీలో 5,06,493 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 70 మంది మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,487కి పెరిగింది. రాష్ట్రంలో నేటికి 4,04,074 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 97,932 మంది చికిత్స పొందుతున్నారు.