Begin typing your search above and press return to search.
భారత్ లో కరోనా బీభత్సం..42 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు
By: Tupaki Desk | 7 Sep 2020 9:10 AM GMTభారత్ లో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతుంది. పాజిటివ్ కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. పాత రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. తాజాగా కేసులతో కలిపి మొత్తం దేశంలో కరోనా కేసుల సంఖ్య 42 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 90,802 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన బులెటిన్ లో తెలిపింది. అదే సమయంలో 1,016 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 42,04,614కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 71,642కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 32,50,429 మంది కోలుకున్నారు. 8,82,542 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.
ఇండియాలో నిన్న 69564 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 32,50,429కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 8,82,542కి చేరింది. ఇండియాలో నిన్న 720362 టెస్టులు చేశారు. మొన్నటి కంటే ఇవి 372292 లక్షలు తక్కువే. మొత్తం టెస్టుల సంఖ్య 4,95,51,507కి చేరింది. ఇండియాలో 90వేల పాజిటివ్ కేసులు ఒకే రోజులో నమోదవ్వడం ఇదే తొలిసారి. ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా ఒకే రోజు ఇన్ని కేసులు నమోదవ్వలేదు. అలాగే మనదేశంలో వరుసగా ఆరో రోజు రోజుకు 1000కి పైగా కరోనా మరణాలు సంభవించాయి.
ఇక , తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం .. . రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,802 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,711 మంది కోలుకున్నారు. దీనితో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,42,771 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,10,241 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 895కు చేరింది.
ఇక , ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,794 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒక్క రోజే 11,915 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 70 మంది మరణించారు. తాజా లెక్కలతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,98,125కి చేరింది. కరోనాను జయించి వీరిలో 3,94,019 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం99,689యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4,417 మంది మరణించారు.