Begin typing your search above and press return to search.
ఇక నో వర్రీ.. నోవ్యాక్సిన్ సక్సెస్!
By: Tupaki Desk | 3 Sep 2020 1:00 PM GMTకరోనాకు బ్రేక్ వేసే రోజులు దగ్గరికి వచ్చాయి. క్లినికల్ ట్రయల్స్ లో అమెరికా సిద్ధం చేస్తున్న నోవ్యాక్సిన్ కు పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. ఈ వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేసిన వ్యక్తుల్లో ఇమ్యూన్ రెస్పాన్స్ పెరిగినట్లు 'న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసన్ ' తెలిపింది. మే నెలలో 131 మందికి సెలైన్ ద్వారా నోవ్యాక్సిన్ ఎక్కించారు. వారిలో 83 మందికి రోగనిరోధక శక్తి మెరుగైంది. 21 రోజుల తర్వాత ఈ బ్యాచ్ కి మరోసారి ఇంజక్షన్ ఇచ్చారు. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వారంతా.. 50 ఏళ్ల వయసు కు లోబడి ఉన్నవారే. ట్రయల్స్ లో ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదా.. కాదా, ఫలితాలు ఏ విధంగా వస్తున్నాయి.. అని వైద్య నిపుణులు పరీక్షించారు. ఇంజక్షన్ వేసిన వారందరికీ కరోనా లక్షణాలు కనిపిస్తే మళ్లీ శ్వాబ్ టెస్ట్ చేయించారు. 35 రోజుల పాటు ఇంజెక్షన్ వేసిన వారి లక్షణాలన్నింటినీ నమోదు చేశారు. పుల్లగా అనిపించడం వంటివి.. అనిపిస్తే వాటిని రికార్డు చేశారు. ఒక వ్యక్తికి మాత్రమే జ్వరం రాగా మిగతా ఎవరిలో అటువంటి సమస్యలు కనిపించ లేదు. ఆ వ్యక్తికి రెండో ఇంజక్షన్ ఇవ్వలేదు. ఇద్దరికి మాత్రం తలనొప్పి, నీరసం కనిపించింది. రెండు రోజుల తర్వాత తగ్గిపోయింది.
35వ రోజు రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో యాంటీ బాడీలు పెరగడం మొదలు పెట్టాయి. మామూలుగా శరీరంలో పెరిగే యాంటీ బాడీలతో పోలిస్తే నాలుగు నుంచి ఆరు రెట్ల యాంటీ బాడీలు పెరిగాయి. ఫేజ్ 1, ఫేజ్ 2లో ఈ వ్యాక్సిన్ కి పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. నోవ్యాక్సిన్ సేఫ్టీ అని.. ఇది కచ్చితంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుందని.. ఈ వ్యాక్సిన్ వాడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవ్యాక్సిన్ ఉపయోగించి వేలల్లో పరీక్షలు జరపాలని, అందులో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకొని ఇది సురక్షితమైనదా.. కాదా అని అని తేల్చుకోవాలని మరికొందరు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలను నమోదు చేస్తుండడంతో.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వ్యాక్సిన్ తొందర్లోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.