Begin typing your search above and press return to search.

ఆ దేశ ప్రజలకి కరోనా వ్యాక్సిన్ వద్దట !

By:  Tupaki Desk   |   2 Sep 2020 12:10 PM GMT
ఆ దేశ ప్రజలకి కరోనా వ్యాక్సిన్ వద్దట !
X
కరోనా వైరస్ .. కరోనా వైరస్ .. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి , అక్కడ తీవ్రమైన ప్రభావాన్ని చూపి ఆ తరువాత ఒక్కొక్క దేశానికీ వ్యాపిస్తూ ప్రపంచం మొత్తం పాకింది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాను సైతం కరోనా దెబ్బకి వణికిపోతోంది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా నుండి కోలుకుంటున్నా కూడా భారత్ లో మాత్రం కరోనా విజృంభిస్తుంది. గత 27 రోజులుగా భారత్ లో నే రోజువారీ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల 53 లక్షలకి పైగా కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ కట్టడి కోసం అన్ని అగ్రదేశాలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. వైరస్ కు మందు కనుగొనడానికి, వ్యాక్సిన్ కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా మిగిలిన దేశాలకంటే ముందు వరుసలో నిలబడుతోంది. దీనికి కారణం ప్రపంచంలోనే మొట్టమొదటి కోవిడ్ 19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ను ఇప్పటికే రిజిస్టర్ చేసి సంచలనం రేపింది.

ఇక విషయానికొస్తే .. కరోనా మహమ్మారిని నివారించే మందు కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంటే కొన్ని దేశాల్లో ప్రజలు మాత్రం ఆసక్తి చూపడం లేదని.. ఐఎంఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పోస్ ఏజెన్సీ నిర్వహించిన సర్వే లో వెల్లడైంది. 27 దేశాల్లో 20 వేల మందిపై ఆన్లైన్ సర్వే చేయగా 74 శాతం మంది టీకా కావాలని.. 26 శాతం మంది టీకా తమకు అవసరం లేదని తెలిపారట. ఈ కావాలా దుష్ప్రభావాలు .. ఇతర కారణాల వల్ల రష్యాలు అత్యధిక మంది టీకా వద్దు అని చెప్పగా.. భారత్ లో కూడా 13 శాతం మంది కరోనా వ్యాక్సిన్ పై అయిష్టత చూపినట్లు తెలిపింది.

కాగా ,దేశంలో నిన్న ఒక్కరోజే 78,357 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 37,69,524 కు చేరింది. మరో 1045 మంది చనిపోవడంతో కరోనా మరణాల సంఖ్య 66,333 కు చేరింది.29,019,09 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 8,01,282 మంది ఆస్పత్రిలో ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది