Begin typing your search above and press return to search.
కరోనా కేసుల్లో రికార్డ్ సృష్టించిన భారత్ .. ఒక్కరోజే 77,266 కేసులు
By: Tupaki Desk | 28 Aug 2020 5:15 AM GMTదేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకి మరింత తీవ్రమవుతోంది. మిగిలిన అన్ని దేశాల్లో కరోనా తగ్గుముఖం పడుతుంటే ..భారత్ లో కరోనా జోరు ఉసేన్ బోల్ట్ వేగాన్ని అందుకునేలా ఉంది. కాగా , తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 77,266 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 33,87,501 కు చేరింది. ఒక్కరోజే 70 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే రెండోరోజు. ఈ రేంజ్ లో అమెరికాలో కూడా కరోనా కేసులు నమోదు కాలేదు. తాజాగా 1057 మంది కోవిడ్ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 61,529 కు చేరింది. ఇప్పటివరకు 25,83,948 మంది కరోనా పేషంట్లు కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 7,42,023 యాక్టివ్ కేసులున్నాయి. ఇక దేశంలో గురువారం 9,01,338 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది. దీంతో మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షలు 3,94,77,848 చేరిందని వెల్లడించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2.5 కోట్ల మంది కోవిడ్‌బారిన పడగా 8.25 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక, తెలంగాణలో కూడా కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,863 కరోనా పరీక్షలు చేయగా 2,932 కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1580 మంది కోలుకున్నారు.ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,415 కి చేరింది. ఆసుపత్రుల్లో 28,941 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 87,675 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 799కి చేరింది.
ఇక ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య గడచిన 24 గంటల్లో మళ్లీ భారీగా పెరిగింది. 24 గంటల్లో 10,621 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,93,090కి చేరింది. అలాగే, 24 గంటల వ్యవధిలో ఏపీలో 92 కరోనా మరణాలు రికార్డు అయ్యాయి