Begin typing your search above and press return to search.
కరోనా అప్డేట్ : దేశంలో 32 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు !
By: Tupaki Desk | 26 Aug 2020 6:15 AM GMTభారతదేశంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం లోనే అత్యధిక కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. వరుసగా 18వ రోజు ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అయ్యాయి. రోజువారీగా కొత్త కేసుల నమోదును చూస్తే .. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులున్న అమెరికా, బ్రెజిల్ కంటే ముందు వరుసలో భారత్ నిలుస్తోంది. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 32 లక్షల మార్కును దాటింది. గత 24 గంటల్లో 67,151 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 1,059 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దీనితో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 32,34,475 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 59,449కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 24,67,759 మంది కోలుకున్నారు. 7,07,267 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. గత పది రోజుల నుంచి ప్రతి రోజూ సుమారు 60 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో జనవరిలో తొలి కేసు నమోదైంది. కరోనా వ్యాప్తి కట్టడికి మార్చి నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. మే నుంచి లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తున్న నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 1 నుండి మొత్తం ఆన్ లాక్ అని ప్రకటించిన నేపథ్యంలో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ఇకపోతే , కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి శరవేగంగా సాగుతోందని తెలిపారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ భారత్ లో సీరమ్ ఇన్ స్టిట్యూట్ ప్రారంభించిందన్నారు. అలాగే, భారత్ బయోటెక్, జయడస్ కాడిలా తొలి దశ ప్రయోగాలు ముగిశాయని , అంతేకాదు, రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్టు వివరిచారు. ఇప్పటికే టీకాకు సంబంధించి రష్యా నుంచి ప్రాథమిక సమాచారం అందిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. బాధ్యతా రహితమైన వ్యక్తులు, మాస్కులు ధరించకపోవడం, సామాజిక దూరం విస్మరించడం కారణంగా దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తోందని ఆయన మాట్లాడారు.