Begin typing your search above and press return to search.

స్పుత్నిక్‌-వి : రష్యా తో చర్చలు జరుపుతోన్న భారత్ .. కీలక ప్రకటన చేసిన కేంద్రం !

By:  Tupaki Desk   |   26 Aug 2020 9:10 AM GMT
స్పుత్నిక్‌-వి : రష్యా తో చర్చలు జరుపుతోన్న భారత్ .. కీలక ప్రకటన చేసిన కేంద్రం !
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తుంది. భారత్ లో కరోనా మహమ్మారి చాలా వేగంగా విజృంభిస్తుంది. అయితే , కరోనాను అరికట్టే వ్యాక్సిన్ కోసం చాలా దేశాల నిపుణులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. కరోనాకి ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ ‌ను తామే అందుబాటులోకి తెచ్చినట్టు రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి‌కి సంబంధించి భారత్ చర్చలు జరుపుతున్నట్టు రష్యా ఈ మద్యే ప్రకటించింది. తాజాగా, దీనిని కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు.

మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి వ్యాక్సిన్ ‌కు సంబంధించి రష్యా ప్రాథమిక సమాచారం అందజేసిందని, పూర్తి వివరాలు రావాల్సి ఉందని తెలిపారు. గమలేయా ఇన్‌ స్టిట్యూట్ అభివృద్ధిచేసిన ఈ వ్యాక్సిన్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్ భారత్‌లో నిర్వహించడమే కాకుండా, ఇక్కడ ఉత్పత్తిచేసే విషయంపై ఆగస్టు 22న రష్యా అధికారులు భారత వ్యాక్సిన్‌ నిర్వహణ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. వ్యాక్సిన్ హడావుడిగా విడుదల చేయడంపై విమర్శలు రావడంతో రష్యా కొంచెం వెనక్కి తగ్గింది. తాము అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి’ని మూడో దశలో భాగంగా 40 వేల మంది వాలంటీర్లపై ప్రయోగించాలని నిర్ణయించింది. అయితే, రష్యా వ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలపై తమకు ఎటువంటి సమాచారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

వ్యాక్సిన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌ మెంట్ టాస్క్‌ ఫోర్స్ ఉపాధ్యక్షుడు డాక్టర్ వినోద్ పాల్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ విజయరాఘవన్ టీకా అభివృద్ధిపై సహకారానికి సూచనలను పరిశీలిస్తారు. టాస్క్‌ ఫోర్స్ ‌లోని సభ్యులు ముఖ్యంగా బయోటెక్నాలజీ, ఐసీఎంఆర్ వ్యాక్సిన్ విషయంలో పరస్పర సహకారం సాధ్యాసాధ్యాలను సమాచారాన్ని పరిశీలిస్తుంది అని కేంద్రం తెలిపారు. రోనా వైరస్ సోకినవారిలో ఇప్పటికే 75% మందికిపైగా కోలుకున్నారు. ప్రస్తుతం 2.70% మందికి ఆక్సిజన్‌ అవసరమవుతోంది. 1.92% మంది ఐసీయూల్లో, 0.29% మంది వెంటిలేటర్లపై ఉన్నారని రాజేశ్‌ భూషణ్‌ వివరించారు.