Begin typing your search above and press return to search.
కరోనా రెండోసారి కూడా సోకచ్చట..జస్ట్ 90 రోజులు మాత్రమే సేఫ్ - ఆ తర్వాత మళ్లీ!
By: Tupaki Desk | 25 Aug 2020 5:30 PM GMTఒకసారి కరోనా మహమ్మారి ఒక్కసారి సోకి , తగ్గిపోయిందంటే మళ్లీ జీవితంలో వైరస్ సోకదు అని మన శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు. అయితే కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి.. 90 రోజుల వరకే కరోనా నుండి సేఫ్ గా ఉంటాడు అని, 90 రోజుల తర్వాత మళ్లీ కరోనా వైరస్ సోకే అవకాశం ఉంది అని తాజాగా చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీన్ని బట్టి చూస్తే కరోనా భారిన పడి కోలుకున్న వారు కూడా..చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా మరోసారి కరోనా బారిన పడే అవకాశం చాలాఉందట.కరోనా సోకిన తర్వాత 28 రోజుల తర్వాత సదరు వ్యక్తి శరీరంలో వైరస్ జాడలేకున్నా వైరస్ వాహకంగా మారే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
కరోనా బాధితుడి శరీరంలోకి 4 రోజుల తర్వాత ఐజీఎమ్ యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఆ తర్వాత వ్యాధి తీవ్రస్థాయికి చేరి.. వివిధ అవయవాలపై ప్రభావం చూపిస్తోంది. ఊపిరితిత్తులు, నాడీమండలం, రక్త సరఫరా వ్యవస్థలను దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు.కరోనా సోకిన 12వ రోజు నుంచి ఐజీజీ యాంటీ బాడీస్ డెవలపవుతాయని.. ఐజీజీ యాంటీబాడీస్ సంఖ్య పెరిగేకొద్దీ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. 14వ రోజు నాటికి శరీరంలో వైరస్ పై రోగనిరోధక శక్తి ఐజీజీ యాంటీబాడీస్ సాయంతో ఆధిపత్యం వహిస్తున్నందున.. రోగికి కరోనా వల్ల ఇబ్బందులు లేవు అని వైద్యులు చెప్తున్నారు. వైరస్ వల్ల రోగికి నష్టం వాటిల్లకుండా యాంటీబాడీస్ రక్షిస్తాయి. 14వ రోజు తర్వాత రోగి శరీరం నుంచి వైరల్ లోడ్ ఉంటుంది. నోరు, ముక్కు నుంచి వచ్చే తుంపరలు, మల మూత్రాలు.. శారీరక ద్రవాలు ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు.
14వ రోజు పూర్తయిన తర్వాత రోగి వినియోగించే టాయిలెట్ల ద్వారా ఇతరులకు కరోనా సోకే అవకాశం ఉంది. మరో 14 రోజుల్లో రోగి శరీరం నుంచి వైరస్ పూర్తిగా బయటకు పోదు. అందువల్లే వైరస్ సోకిని 28 రోజుల తర్వాతే ప్లాస్మా దానానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్ అంగీకరించాయి. ఈలోపు ప్లాస్మా సేకరిస్తే.. దాంతో పాటు వైరస్ వస్తుందని చెబుతున్నారు. వైరస్ సోకి తగ్గిన వ్యక్తి 28 రోజులపాటు దూరంగా ఉండాలని కోరుతున్నారు. వైరస్ తగ్గిన తర్వాత కూడా సదరు వ్యక్తులు సరైన జాగ్రత్తలు తీసుకొని శుభ్రంగా ఉండాలని చెబుతున్నారు. ఆలా జాగ్రత్తలు తీసుకోకపోతే మరోసారి వైరస్ వస్తుందని..అప్పుడు తొందరగా వ్యాధి తగ్గదని తెలిపారు. ఇదేకాదు వైరస్ నివారణ కోసం ఏడాదికోసారి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ తయారీలో చాలా దేశాల నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.