Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ : ఒక్కరోజే 60,975 మందికి పాజిటివ్!

By:  Tupaki Desk   |   25 Aug 2020 5:00 AM GMT
కరోనా వైరస్ : ఒక్కరోజే  60,975 మందికి పాజిటివ్!
X
ఇండియా లో కరోనామహమ్మారి పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా కేసులు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. దాదాపుగా గత 20 రోజులుగా ప్రతిరోజూ కూడా 60 వేలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇకపోతే తాజాగా , గత 24 గంటల్లో 60,975 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 848 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 31,67,324 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 58,390కి పెరిగింది.

కాగా , దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 24,04,585 మంది కోలుకున్నారు. 7,04,348 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 3,68,27,520 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,25,383 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది.

ఇక , తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2579 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, అదే సమయంలో 9 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1752 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,670కి చేరింది. ఆసుపత్రుల్లో 23,737 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 84,163 మంది డిశ్చార్జ్ అయ్యారు . రాష్ట్రంలో మృతుల సంఖ్య మొత్తం 770కి చేరింది.

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 8,601 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటివరకు ఏపీలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,712కి చేరింది. కరోనాను జయించి వీరిలో 2,68,828 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం 89,516 యాక్టివ్ కేసులున్నాయి. అలాగే కొత్తగా మరో 86 మంది మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,368 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 54,463 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు 32,92,501మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.