Begin typing your search above and press return to search.
కరోనా దెబ్బకి 66 శాతం మానేశారా !
By: Tupaki Desk | 24 Aug 2020 5:30 AM GMTకరోనా వైరస్...ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య. ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా కూడా దీనికి ఇంతవరకు సరైన వ్యాక్సిన్ లేదు. అయితే చాలా దేశాల వైద్య నిపుణులు కరోనా వ్యాక్సిన్ ను కనిపెట్టే పనిలో నిమగ్నమైయ్యారు. రష్యా ఇప్పటికే ఓ వ్యాక్సిన్ ను వెలుగులోకి తీసుకువచ్చింది. కానీ, రష్యా వ్యాక్సిన్ పై చాలా దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 2 కోట్ల 30 లక్షల మంది కరోనా భారిన పడ్డారు. ఇక మనదేశంలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటిపోయింది. ఇకపోతే , కరోనా మహమ్మారి దెబ్బకి .. ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. రోజురోజుకి కరోనా లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇక , ఈ నేపథ్యంలో జ్వరం, ఆగకుండా దగ్గు, ఊపిరి తీసుకో లేకపోవడం లాంటి కరోనావైరస్ లక్షణాలు పొగ తాగని వారి కంటే పొగ తాగే వారిలో 14 శాతం అధికమని జో కోవిడ్ సింప్టం ట్రాకర్ ద్వారా లభించిన సమాచారం. దీనితో పొగ తాగితే కరోనా వస్తుంది అని చాలామంది భయపడి .. పొగ త్రాగడాన్ని మానేస్తున్నారు. ముఖ్యంగా కరోనా భయంతోనే పొగతాగే వారి సంఖ్య భారీగా తగ్గినట్టు ఫౌండేషన్ ఫర్ స్మోక్ - ఫ్రీ వరల్డ్ సంస్థ చేసిన సర్వే లో వెల్లడైంది. భారతదేశంలో లాక్ డౌన్ సమయంలో 66 % మంది పొగ తాగడం మానేశారని తేలింది. చైనా కరోనా సోకినా 82 వేల మందిలో 95 % మందికి సిగరెట్ తాగే అలవాటు ఉంది. పొగ పీల్చినప్పుడు s -2 ఎంజైమ్ ను ముక్కు ఎక్కువగా స్రవిస్తుంది అని ,దీనివల్ల నేరుగా కరోనా వైరస్ ఉపిరితితుల్లోకి వెళ్తుంది అని WHO తెలిపింది. గత సంవత్సరాలతో పోల్చి చూస్తే ఈ సంవత్సరం మొదటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువ మంది పొగ తాగడానికి స్వస్తి చెప్పారని తెలిసింది.