Begin typing your search above and press return to search.

భారత్ కరోనా అప్డేట్ : ఒక్కరోజే 69,878 కేసులు, 945 మరణాలు !

By:  Tupaki Desk   |   22 Aug 2020 5:00 AM GMT
భారత్ కరోనా అప్డేట్ : ఒక్కరోజే  69,878 కేసులు, 945 మరణాలు !
X
భారత్ ‌లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల విలయతాండవం కొనసాగుతోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనాను అరికట్టాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఏది వర్కౌట్ కావడం లేదు. ప్రతిరోజూ 60 వేలకి పైగా కరోనా కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. ఇకపోతే , తాజాగా .. గడచిన 24 గంటల్లో 69,878 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం దేశంలో ఇదే తొలిసారి. తాజాగా 945 మంది కరోనా‌ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 55,794 కు చేరింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,75,702 కు చేరింది. దేశంలో ప్రస్తుతం 6,97,330 యాక్టివ్‌ కేసులున్నాయి.

గడిచిన 24 గంటల్లో 63,631మంది వైరస్‌ బాధితులు కోలుకున్నారు. దీంతో కరోనా వైరస్ ‌ను జయించిన వారి మొత్తం సంఖ్య 22,22,578 కు చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌ లో తెలిపింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 74.30 శాతం, మరణాల రేటు 1.89 శాతంగా ఉందని తెలిపింది. ఇదిలాఉండగా.. భారత్‌ లో ఇప్పటివరకు 3.44 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయిని భారత్ వైద్య విద్య పరిశోధన మండలి తెలిపింది. రోజూ 10 లక్షల వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. అలాగే కొత్త కరోనా కేసుల నమోదులో భారత్ గత 2 వారాలుగా అగ్ర స్థానంలో కొనసాగుతుంది. మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్, మెక్సికో తర్వాత ఇండియా నాలుగో దశలో ఉంది. రోజువారీ మరణాల్లో ఇండియా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది.

ఇక , తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 2,474 మందికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,768 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,865కి చేరింది. ఇప్పటివరకు 78,735 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 744కి చేరింది.

ఇక , ఏపీలో కరోనా మహమ్మారి విజృంభన చేస్తోంది. ఇక తాజాగా శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ లో గడిచిన 24 గంటల్లో 55,010 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9,544 మందికి కరోనా పాజిటివ్ ‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 3,34,940కు చేరింది. కరోనా వైరస్ మరణాలు కూడా భారీగా సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 91 మంది కరోనా మహమ్మారి వల్ల మృతి చెందారు. దీనితో ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,092కు పెరిగింది.