Begin typing your search above and press return to search.

కరోనా లేటెస్ట్ అప్డేట్ : ఒక్కరోజే 68 వేల కేసులు, 983 మరణాలు !

By:  Tupaki Desk   |   21 Aug 2020 7:15 AM GMT
కరోనా లేటెస్ట్ అప్డేట్ : ఒక్కరోజే 68 వేల కేసులు, 983 మరణాలు !
X
కరోనా వైరస్ ..కరోనా వైరస్ .. గత కొన్ని రోజులుగా దేశంలో వేగంగా విజృంభిస్తుంది. ప్రతి రోజు కూడా 60 వేలకి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇకపోతే , గురువారం ఒక్కరోజే ఏకంగా 68,898 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 29,05,823 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 983 కరోనా‌ బాధితులు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 54,849 కు చేరింది. తాజాగా 62,282 కరోనా పేషంట్లు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 21,58,946 కు చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం బులెటిన్ ‌లో వెల్లడించింది. ప్రస్తుతం మన దేశంలో 6,92,028 యాక్టివ్ కేసులున్నాయి. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 8,05,985 శాంపిల్స్‌ను పరీక్షించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3 కోట్ల 34 లక్షల 67 వేల 237 మందికి కరోనా పరీక్షలు చేసారు.

ఇక , తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,967 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1781 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,391కి చేరింది. ఆసుపత్రుల్లో 21,687 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 76,967 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 737కు చేరింది.

ఇక , ఆంధ్రప్రదేశ్ ‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లోమరో 9,393 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటివరకు ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,396కి చేరింది. కరోనాను జయించి 2,35,218 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా బారినపడి రాష్ట్రంలో 3001 మంది మరణించారు. ప్రస్తుతం 87,177 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.