Begin typing your search above and press return to search.
పీఎం - సీఎం చెప్పినా డోంట్ కేర్ .. స్కూల్ తెరిచిన ప్రిన్సిపాల్ - కేసు నమోదు!
By: Tupaki Desk | 19 Aug 2020 8:10 AM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ మహమ్మారిని అరికట్టడానికి చాలా దేశాలు లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకు వచ్చాయి. దీనితో దాదాపుగా అన్ని దేశాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. భారతదేశంలో మార్చి 25 తేదీ నుంచి లాక్ డౌన్ అమలు చేయ్యడంతో విద్యా సంస్థలు మూత పడ్డాయి. ఆ తరువాత కరోనా పూర్తిగా కంట్రోల్ కాకపోయినప్పటికీ , లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా పలు ఆర్థిక లావాదేవీలు, అనేక వ్యాపారాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ ,విద్యాసంస్థలు ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
కరోనా వైరస్ నియమాలు గాలికివదిలేసి, ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం ఆదేశాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా విద్యార్థులను పశువుల మందలో తోలినట్లు గదుల్లో నిర్బంధించి క్లాసులు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నియమాలు గాలికి వదిలి పాఠశాల ప్రారంభించిన రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు సైతంషాక్ కు గురైనారు. కరోనా నిబంధనలు గాలికి వదిలేసిన ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ తో పాటు యాజమాన్యం మీద కేసులు నమోదుచేసారు.
పూర్తి వివరాలు చూస్తే ...దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ పెరుగుతుంది. దేశం లో ఏ రాష్ట్రం లో కూడా విద్యా సంస్థలకి అనుమతి ఇవ్వలేదు. ప్రైవేటు స్కూల్స్ మాత్రం మేము ఓ విద్యాసంవత్సరం నష్టపోతామని, స్కూల్స్ ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నా కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి ఒప్పుకోలేదు. ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఏమైనా సరే స్కూల్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకోని. రాత్రికిరాత్రి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి మరుసటి రోజు విద్యార్థులను స్కూల్ కు పిలిపించి తరగతులు నిర్వహించారు. తల్లిదండ్రులకి కరోనా నియమాలు పాటిస్తాం అని చెప్పి , పశువుల్ని తోలినట్టు ఒకే రూమ్ లో చాలామందిని కూర్చోబెట్టి క్లాసులు నిర్వహించారు.
చాలా రోజుల తరువాత స్కూల్స్ ప్రారంభం కావడంతో విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా స్కూల్ కు వెళ్లారు. విద్యార్థులు గుంపులు గుంపులుగా కుర్చున్న సమయంలో తీసిన ఫోటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.ఇదే సమమంలో మా పిల్లలు ప్రాణాలతో స్కూల్ యాజమాన్యం చెలగాటం ఆడుతోంది, ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని, ఎక్కడ మా పిల్లలు కరోనా వైరస్ బారినపడుతారో అనే భయంగా ఉందని విద్యార్థుల కుటుంబ సభ్యులు ఉత్దర్ ప్రదేశ్ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీనితో రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు జలాన్ లోని ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ లతో పాటు ఆ విద్యాసంస్థ యాజమాన్యం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రాష్ట్ర సీఎం ఇంకా విద్యాసంస్థలకు అనుమతి ఇవ్వలేదు అని ఒకవైపు చెప్తుంటే ..మరోవైపు స్కూల్ తెరవడం పై తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటడం మరో విశేషం.