Begin typing your search above and press return to search.

ఏ వ్యాక్సిన్ సక్సెస్ అయినా మనకే ముందు?

By:  Tupaki Desk   |   19 Aug 2020 7:00 AM GMT
ఏ వ్యాక్సిన్ సక్సెస్ అయినా మనకే ముందు?
X
ప్రపంచవ్యాప్తంగా 100కు పైగానే కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు సాగుతున్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత నాణ్యంగా వ్యాక్సిన్ ట్రయల్స్ చేస్తున్న సంస్థలు కొన్నే. ఇప్పటికే ఆదరబాదరగా రిలీజ్ చేసిన రష్యా వ్యాక్సిన్ ను తీసుకోవడానికి అన్ని దేశాలు నో చెప్పాయి. ఈ క్రమంలోనే అత్యంత విశ్వసనీయంగా పరిశోధనలు పారదర్శకంగా చేస్తున్న ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ‘ఆస్ట్రాజెనికా’ వ్యాక్సిన్ పైనే ఇప్పుడు అందరి చూపు ఉంది.

ఆక్స్ ఫర్డ్ మొదటి నుంచి పద్ధతి ప్రకారం ప్రయోగాలు చేస్తోంది. దాని ఫలితాలు వెల్లడిస్తోంది. మంచి ఫలితాలు వచ్చాయి. రోగనిరోధక శక్తి గణనీయంగా ఆక్స్ ఫర్డ్ టీకాతో పెరిగింది.

ఇక చైనాకు చెందిన కాన్ సినో బయోలాజిక్స్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కు, ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కు చాలా వరకు దగ్గర పోలికలున్నాయి. రెండూ జన్యుపరంగా ఇంజినీరింగ్ చేసిన టీకాలే..

ఇక భారత్ లో భారత్ బయోటెక్, క్యాడిలా ప్రయోగాలు ఆశాజనకంగా ఉన్నాయి. రెండో దశలో సక్సెస్ అయ్యారు. త్వరలో మూడో దశ ప్రయోగాలు జరుగనున్నాయి. ఇక ఆక్స్ ఫర్డ్ టీకా ట్రయల్స్ కూడా మన దేశంలో సీరం ఇన్ స్టిట్యూట్ నిర్వహిస్తోంది.

ఈ మూడింటిలో ఏది సక్సెస్ అయినా ముందుగా వ్యాక్సిన్ అందేది మన భారత్ కే. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలోనే ఈ వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇక భారత్ భారీగా ఉత్పత్తి చేస్తే ప్రపంచానికి అందించగలదు.