Begin typing your search above and press return to search.
24 గంటల్లో 67వేల కేసులు.. 973మరణాలు
By: Tupaki Desk | 16 Aug 2020 9:30 AM GMTదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. శనివారం దేశవ్యాప్తంగా 67వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏకంగా ఒక్కరోజులోనే 973మంది ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 25,90,572కు చేరింది.
ఇక భారత్ లో కరోనా వైరస్ తో మరణాల్లో మరో రికార్డ్ నమోదైంది. ఇప్పటివరకు మహమ్మారి కారణంగా దేశంలో 50వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో గత 15 రోజుల్లోనే 27శాతం మంది ప్రాణాలు పోవడం తీవ్రతకు అద్దం పడుతోంది.గత జులైలో 19122మరణాలు సంభవించగా.. ఆగస్టు రెండు వారాల్లో ఏకంగా 13,500 మంది ప్రాణాలు పోయాయి.
తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 67103 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. శనివారం దేశవ్యాప్తంగా 55వేల మందికిపైగా కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 18.5 లక్షలకు చేరింది. దేశంలో ప్రస్తుతం 6.8 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మహారాష్ట్రలో అత్యధికంగా 12614 కొత్త కేసులు నమోదుకాగా.. ఆ తర్వాత కర్నాటకలో 8818, ఆంధ్రప్రదేశ్ లో 8756 కేసులు బయటపడ్డాయి.
వరుసగా నాలుగో రోజు దేశంలో మరణాల సంఖ్య 900కిపైగా నమోదైంది. మొత్తం 973మంది ఒక్కరోజులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 322మంది చనిపోయారు.
తెలంగాణలో తాజాగా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలో కొత్తగా 1102 కేసులు వెలుగుచూశాయి.కొత్తగా 24గంటల్లో 9 మంది మరనించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91361కి చేరగా.. ఇప్పటిదాకా రాష్ట్రంలో 693మంది కరోనాతో చనిపోయారు.