Begin typing your search above and press return to search.

దేశంలో కరోనా ఉగ్రరూపం ..24 గంటల్లో ఎన్నంటే ?

By:  Tupaki Desk   |   11 Aug 2020 4:30 AM GMT
దేశంలో కరోనా ఉగ్రరూపం ..24 గంటల్లో ఎన్నంటే ?
X
దేశంలో కరోనా మహమ్మారి జోరు చూపిస్తూనే ఉంది. ప్రతిరోజూ కూడా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ వివరాల ప్రకారం .. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 53,601 కేసులు నమోదు కాగా, 871 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 47,746 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 22,68,676 కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 45,257 కి పెరిగింది. 6,39,929 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 15,83,490 మంది కోలుకున్నారు.

ఇకపోతే , దేశంలో ప్రస్తుతం కరోనా మరణాల రేటు 2 శాతంగా ఉంది. కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారు. ప్రపంచంలో ఇది 3.65 శాతంగా ఉంది. అలాగే ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 69.80 శాతంగా ఉంది. నిన్నటి వరకు మొత్తం 2,45,83,558 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. నిన్న ఒక్కరోజులో 4,77,023 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.

ఇక , ప్రపంచంలో మొత్తం కేసుల్లో ఇండియా మూడోస్థానంలో ఉంది. రోజువారీ కరోనా కేసుల్లో అమెరికాను వెనక్కి నెట్టి ఇండియా మొదటి స్థానంలో ఉంది. అలాగే, మొత్తం మరణాల్లో భారత్ టాప్ 5లో ఉంది. ఇక రోజువారీ మరణాల్లో అమెరికా, బ్రెజిల్‌ను వెనక్కి నెట్టి ఇండియా మొదటి స్థానానికి చేరింది. రోజువారీ మరణాల్లో ఇండియా తర్వాత బ్రెజిల్ ఉండగా ఆ తర్వాత అమెరికా ఉంది.