Begin typing your search above and press return to search.
దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు ..ఒక్కరోజే 1007 మంది మృతి !
By: Tupaki Desk | 10 Aug 2020 12:30 PM GMTఇండియా లో కరోనా వైరస్ కేసుల సంఖ్య , కరోనా భారిన పడి , చనిపోయిన వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 62,064 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 1,007 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.అలాగే , దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 22,15,075కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 44,386కి పెరిగింది. 6,34,945 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 15,35,744 మంది కోలుకున్నారు. ఇక దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగతోంది. దేశంలో వరుసగా నాలుగోరోజు 60వేల పై చిలుకు కేసులు బయటపడ్డాయి .
అయితే, ప్రపంచ దేశాల్లో మరణాల రేటు, 3.67గా ఉండగా... ఇండియాలో అది 2 శాతంగానే ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,45,83,558 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్కరోజులో 4,77,023 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది. ప్రస్తుతం ప్రపంచంలో మొత్తం కేసుల్లో ఇండియా మూడోస్థానంలో ఉండగా, రోజువారీ కేసుల్లో అమెరికాను వెనక్కి నెట్టి భారత్ మొదటి స్థానంలో ఉంది. అలాగే మొత్తం మరణాల్లో భారత్ , టాప్ 5లో ఉండగా రోజువారీ మరణాల్లో అమెరికాను వెనక్కి నెట్టి ఇండియా మొదటి స్థానానికి చేరింది. ప్రపంచంలో మొత్తం కరోనా కేసుల్లో 50 శాతం అంటే కోటికి పైగా అమెరికా, బ్రెజిల్, ఇండియాలోనే ఉన్నాయి.
కాగా, తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 80 వేలను దాటింది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,256 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,587 మంది కోలుకోగా, 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,751కి చేరింది. మృతుల సంఖ్య మొత్తం 637కు చేరింది.
ఇక , ఆంధ్రప్రదేశ్ లో కరోనా మరణాల సంఖ్య 2వేలు దాటింది. గత 24 గంటల్లో ఏపీలో 97 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో చనిపోయిన వారి సంఖ్య 2036కి పెరిగింది. గత 24 గంటల్లో అత్యధికంగా 10,820 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,27,860కి చేరింది.