Begin typing your search above and press return to search.
శృంగారానికి వాడే మందు కరోనాకు చెక్ పెట్టేస్తుందట
By: Tupaki Desk | 7 Aug 2020 11:30 AM GMTవినేందుకు విచిత్రంగా ఉన్నా.. ఇది నిజమని చెబుతున్నారు వైద్యులు. శృంగారం కోసం వినియోగించే మందుల్ని వాడితే కరోనాకు చెక్ పెట్టినట్లు అవుతుందన్న విషయాన్ని గుర్తించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారిని నిలువరించేందుకు సరైన మందులు లేని నేపథ్యంలో..కొన్ని కాంబినేషన్లను ప్రయత్నిస్తున్నారు. ఇందులో కొన్నింటి విషయంలో వస్తున్న ఫలితాలు చక్కగా వస్తుండటం విశేషం.
శృంగార వేళలో పురుషులకు చికాకు కల్పించే అంగస్తంభన సమస్యను అధిగమించేందుకు ఆర్ఎల్ఎఫ్ -100 అనే ఔషధాన్ని వాడుతుంటారు. ముక్కు ద్వారా పీల్చే ఈ మందుకు ‘అవిప్టడిల్’ అనే పేరుతో అమ్ముతుంటారు. ఈ మందును కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి.. ఒక మోస్తరుగా ఉన్న వారికి వినియోగించి చూశారు. ఫలితాలు అనూహ్యంగా వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఈ మందు వాడేందుకు అమెరికా ఆహార.. ఔషధ నియంత్రణ సంస్థ ఓకే చెప్పటంతో దీన్ని వినియోగించి చూశారు. అంచనాలకు తగ్గట్లే.. సానుకూల ఫలితాలు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ మందుకు పేటెంట్లు ఉన్న స్విస్ సంస్థ రిలీఫ్ థెరపాటిక్స్.. ఇజ్రాయిల్-అమెరికా సంస్థ న్యూరో ఆర్ఎక్స్ తో కలిసి సెప్టెంబరు ఒకటి నుంచి ప్రయోగాల్ని నిర్వహించనున్నారు. తొలుత ఈ మందును అమెరికా కు చెందిన ఒక 54 ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తుల మార్పడి శస్త్రచికిత్స ఫెయిల్ కావటంతో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు గురయ్యాడు. అదే సమయంలో అతడికి కరోనా సోకింది.
ఈ క్రమంలో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను.. నాలుగు రోజుల పాటు వెంటిలేటర్ల మీదనే చికిత్స చేశారు. దాని మీద నుంచి బయటకు తెచ్చేందుకు ఆర్ఎల్ఎఫ్ - 100 ఔషధాన్ని వినిగించగా.. అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి.
ఆ తర్వాతి కాలంలో ఇదే మందును పలువురికి వినియోగించి చూశారు. వీరంతా కోలుకోవటం గమనార్హం. ఈ మందును వినియోగించటం ద్వారా ఏక కేంద్ర తెల్ల రక్తకణాల్లో కరోనా వైరస్ సంఖ్య పెరగకుండా ఈ శృంగార ఔషధం సాయం చేస్తుందని తేల్చారు. దీనిపై మరిన్ని ప్రయోగాలు జరగటం ద్వారా.. కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.