Begin typing your search above and press return to search.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ముక్కున వేలేసుకునేలా చేసిన ప్రశ్న
By: Tupaki Desk | 4 Aug 2020 4:30 AM GMTబుర్రెకో ఆలోచన అని ఊరికే అనలేదేమో? కరోనా భయం రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలకు చిత్ర విచిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి. తమకొచ్చే ఆలోచనల్లో శాస్త్రీయతను వదిలేసి.. వెంటనే అమలు చేయటం.. ప్రమాదాలు కొని తెచ్చుకోవటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. పిచ్చ లాజిక్కులు తెర మీదకు తీసుకొచ్చి.. ఇలా చేయొచ్చుగా అని ప్రపంచ ఆరోగ్య సంస్థను అడుగుతున్న వైనం ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా అలాంటి ఒక అంశంపై డబ్ల్యూహెచ్ వో స్పందించింది.
హ్యాండ్ శానిటైజర్ ను చేతులకు రాసుకుంటే.. చేతులపై ఉండే వైరస్ చచ్చిపోతుంది కదా.. అలాంటప్పుడు అదే శానిటైజర్ ను ముక్కు.. నోటి చుట్టూ రాసుకుంటే తప్పేంటి? అలా చేస్తే.. అదే పనిగా మాస్కు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కదా? అంటూ ప్రశ్నించారు. విన్నంతనే భలే సందేహం వచ్చిందనిపించక మానదు. ఈ తరహా ప్రశ్నకు తాజాగా డబ్ల్యూహెచ్ వో సమాధానం ఇచ్చింది.
హ్యాండ్ శానిటైజర్.. ఆల్కహాల్.. క్లోరిన్ లాంటివి ఒంటి మీద చట్లుకుంటే.. అవి శరీరం లోపల ఉన్న కరోనా వైరస్ ను చంపలేవని చెప్పింది. అంతేకాదు.. అలా చల్లుకుంటే బట్టలు.. కళ్లు.. ముక్కు.. నోటికి ప్రమాదమని వెల్లడించింది. ఆల్కహాల్.. క్లోరిన్ అనేవి.. ఏదైనా ప్రదేశాల మీద ఉన్న కరోనా వైరస్ ను తరిమేసేందుకు మాత్రమే వాడతారన్నది మర్చిపోకూడదని చెప్పింది. అంతేకాదు.. ఇలాంటి కొత్త ఐడియాలు వచ్చినంతనే.. ప్రయోగించటం మానేసి.. నిపుణుల సలహాలు తీసుకోవాలని చెబుతున్నారు. ఏం చెప్పారో అర్థమైందిగా?