Begin typing your search above and press return to search.
లేటెస్ట్ కరోనా అప్డేట్ : దేశంలో కొత్త కేసులు ఎన్నంటే ?
By: Tupaki Desk | 1 Aug 2020 9:50 AM GMTదేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. రోజు నమోదు అయ్యే కరోనా కేసులు సంఖ్య 50 వేలను దాటేసి... 60 వేల వైపుగా పోతుంది. కరోనా కట్టడి కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న కంట్రోల్ లోకి రావడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 57118 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,95,988కి చేరింది. తాజాగా 36,569 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 10,94,374కి చేరింది. అలాగే తాజాగా 764 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 36,511కి చేరింది. ప్రస్తుతం మనదేశంలో 5,65,103 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఒక్కరోజులో ఇంత భారీగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
కాగా, నిన్నటి వరకు మొత్తం 1,93,58,659 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 5,25,689 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.చైనా, అమెరికా, రష్యా తర్వాత అత్యధిక కరోనా పరీక్షలు చేసిన నాలుగో దేశం భారత్. ఇకపోతే , ప్రస్తుతం ఇండియా లో కరోనా రికవరీ రేటు 64.53 శాతంగా ఉంది. అలాగే మరణాల రేటు 2.15 శాతంగా ఉంది. ప్రపంచ దేశాలతో పోల్చితే రికవరీ, మరణాల రేటులో భారత్ కొంచెం మెరుగ్గా ఉంది. ప్రస్తుతం అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో ప్రపంచంలో ఇండియా టాప్ 3లో ఉంది. రోజువారీ కేసుల్లో అమెరికా తర్వాత రెండోస్థానంలో ఉంది. ఇక మొత్తం మరణాల్లో టాప్ 5లో ఉంది.
ఇక, తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నేటి ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. తాజాగా మరో 2,083 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే మరో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మరో 1,114 మంది కోలుకున్నారు. దీనితో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 64,786. ఆసుపత్రుల్లో 17,754 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 43,751 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 530కి చేరింది.
ఇకపోతే , తాజగా ఏపీలో 10,376 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే ప్రథమం. దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,40,933కి చేరింది. అలాగే ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1,349కి చేరింది. కొత్తగా 3,822 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ఇంకా 75,720 మంది చికిత్స పొందుతున్నారు.