Begin typing your search above and press return to search.
మహమ్మారి కల్లోలం: ఒక్కరోజే అరలక్ష పాజిటివ్.. వెయ్యి మంది మృతి
By: Tupaki Desk | 27 July 2020 6:30 AM GMTదేశంలో మహమ్మారి విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. కేసులు ఆదివారం రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే దేశవ్యాప్తంగా 50 వేలకు పైగా కేసులు నిర్దారణ అయ్యాయి. దేశంలో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దేశంలో ఒక్కరోజే అరలక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇన్నేసి కేసులు తొలుత మూడు నెలల పాటు సమయం పట్టగా ఇప్పుడు ఒక్కరోజులోనే 50 వేల కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా ఆదివారం 50,362 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. మరో 717 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 14,34,851కి చేరాయి. మరణాలు 32,812కి చేరాయి. గతవారంతో పోల్చితే దేశంలో పాజిటివ్ కేసులు 28 శాతం, మరణాలు 19 శాతం పెరిగాయి.
దేశంలో ఇప్పటివరకు ప్రతి ఐదు వైరస్ కేసులలో ఒకటి గత వారంలో నమోదయ్యింది. గతవారం (జులై 20-26) దేశంలో మొత్తం 3,17,892 కేసులు నమోదవగా.. అంతకు ముందువారం 2,37,999గా ఉంది. మరణాల విషయానికి వస్తే గతవారం దేశంలో 5,315 మంది ప్రాణాలు కోల్పోగా.. అంతకుముందు వారం ఇది 4,285 మంది చనిపోయారు. అమెరికా, బ్రెజిల్లో నమోదైనట్లు భారత్ లో కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజులోనే తొలిసారి 40వేల కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా తొలిసారి జూలై 23వ తేదీన 750 మార్క్ దాటాయి. ఆ తర్వాతి రోజు 757 మంది చనిపోయారు. ఆదివారం 717 మంది చనిపోగా.. మహారాష్ట్రలో 267 మంది, తమిళనాడు 85, కర్ణాటక 82, ఆంధ్రప్రదేశ్లో 56 మంది ప్రాణాలు కోల్పోయారు.
కేసుల నమోదు ఇలా ఉండగా రికవరీ రేటు మెరుగ్గా ఉంది. వారంలో దేశంలో 2,17,660 మంది కోలుకున్నారు. రికవరీ కేసుల కంటే యాక్టివ్ కేసులు 94,917 ఎక్కువగా ఉన్నాయి.
అత్యధికంగా మహారాష్ట్రలో ఆదివారం 9,431 కేసులు నిర్దారణ కాగా.. ఆంధ్రప్రదేశ్ 7,627, తమిళనాడు 6,986, కర్ణాటక 5,199 కేసులతో తర్వాతి స్థానంలో ఉన్నాయి. దేశంలో ఆదివారం నమోదైన మొత్తం కేసుల్లో 60 శాతం ఈ నాలుగు రాష్ట్రాల్లోనే ఉండడం గమనార్హం. ఈ విధంగా వైరస్ ఊహించని రీతిలో ప్రబలుతోంది.