Begin typing your search above and press return to search.
టీకాల అడ్డా భారత్ : వైరస్ కు కూడా త్వరలోనే..
By: Tupaki Desk | 20 July 2020 7:15 AM GMTపుట్టినప్పటి నుంచి మానవ శరీరానికి కొన్ని టీకాలు అవసరం. భారత్‌లో అవి మొదట పోలియో టీకా నుంచి మొదలవుతుంది. పోలియో టీకా పుట్టిన ప్రతి ఒక్కరికీ ప్రస్తుతం వేస్తున్నాం. ఆ టీకా బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి ఎంతో దోహదం చేస్తుంది. దీంతో పాటు వారి ఆరోగ్యాన్ని బట్టి మరికొన్ని టీకాలు వేస్తుంటారు. ఆ విధంగా ఒక మానవుడికి జీవితంలో ఎన్నో టీకాలు పడుతున్నాయి. అతి ఎక్కువగా టీకాలు వినియోగిస్తున్న దేశం భారత్. ఆరోగ్యం కోసం భారతీయ సంస్థలు ఎన్నో టీకాలు కనిపెట్టాయి. అందుకే ప్రస్తుతం ప్రపంచ దృష్టి అంతా భారత్‌పైనే ఉంది. ప్రస్తుతం వచ్చిన ఆరోగ్య ఉత్పాతం నుంచి బయట పడడానికి ఆ టీకాలే శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి.
మనదేశంలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్, బయో-ఈ, భారత్ బయోటెక్ వంటి సంస్థల అత్యంత ఖరీదైన వ్యాక్సిన్లను ప్రజలకు అందుబాటు ధరల్లోకి తీసుకొచ్చాయి. అందుకే భారతదేశానికి ‘వ్యాక్సిన్ల ఉత్పత్తికి పవర్‌హౌస్’ అనే పేరు వచ్చింది. ఆ పేరుకు తగ్గట్టు భారతదేశంలో అంతలా టీకాలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి ఏటా తన టీకాల కార్యక్రమం కోసం సేకరించే వ్యాక్సిన్లలో 60 నుంచి 80 శాతం, ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 60 శాతం భారత్‌వే ఉండడం విశేషం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వంటివాటి కోసం పెద్ద ఎత్తున భారత కంపెనీలు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న విషయం మీకు తెలుసా. అలాంటి భారతదేశంపై ఇప్పుడు ప్రపంచ దేశాలు ప్రస్తుత వైరస్‌కు టీకాలు కనుగొంటుందనే ఆశతో ఉన్నాయి. అందుకే ఆ వైరస్ టీకా కోసం ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోంది. తక్కువ ధర.. భారీగా ఉత్పత్తి చేయడమే భారత ప్రత్యేకత. దానికి ఉదాహరణలుగా హెపటైటిస్ -బీ వ్యాక్సిన్, రోటా వైరస్ వ్యాక్సిన్ నిలుస్తున్నాయి.
1997లో శాంతా బయోటెక్ కంపెనీ హెపటైటిస్-బీ వ్యాక్సిన్‌ను ఒక డాలర్ కన్నా తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చి చరిత్ర సృష్టించింది. అంతేకాదు డయేరియాకు కారణమైన రోటావైర్‌సను నిర్వీర్యం చేసే వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ సంస్థ 2013లో కేవలం రూ.60కే అందుబాటులోకి తెచ్చింది. దీని ధర అప్పటి స్విస్, బ్రిటిష్ కంపెనీలు విక్రయించే వ్యాక్సిన్ల ధరలో పదిహేనో వంతుకే ఈ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ అందించింది. ప్రస్తుతం ప్రబలుతున్న మహమ్మారి వైరస్‌కు కూడా వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో భారత్ బయోటెక్ ఉంది. తాజాగా భారత్ బయోటెక్ కంపెనీ రూపొందించిన కోవ్యాక్సిన్, జైడస్ క్యాడిలా కంపెనీ అభివృద్ధి చేసిన జైకొవ్-డి. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ-ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ను మనదేశంలో పెద్ద ఎత్తున తయారుచేయడానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) ఒప్పందం కుదుర్చుకుంది.
దీంతో పాటు పనాసియా బయో టెక్, ఇండియన్ ఇమ్యూనలాజికల్స్, మిన్‌వ్యాక్స్, బయోలాజికల్-ఈ సంస్థలు కూడా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. నేషనల్ డెయిరీ డెవల్‌పమెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) అనుబంధ సంస్థ ఇండియన్ ఇమ్యునలాజికల్స్.. వ్యాక్సిన్ తయారీకి ఆస్ట్రేలియా గ్రిఫిత్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విధంగా భారత్‌కు చెందిన అన్ని ఔషధ సంస్థలు ఆ మహ్మమ్మారికి విరుగుడు కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అందుకే ప్రపంచ దృష్టి భారత్‌పై ఉంది.
భారత ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీలోపు వైరస్‌కు విరుగుడుగా ఓ వ్యాక్సిన్ తీసుకురావాలని ఓ లక్ష్యం విధించింది. తదనుగుణంగా కొన్ని సంస్థలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవేళ వ్యాక్సిన్ కనిపెట్టినా ఇంత పెద్ద సంఖ్యలో అందరికీ వ్యాక్సిన్ వేయాలంటే భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అందుకే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆ బాధ్యతలు తీసుకుంది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్.. ఎస్‌ఐఐ తయారుచేసిన టీబీ నిరోధక వ్యాక్సిన్ వీపీఎం1002పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఈ విధంగా భారత్‌లో మహమ్మారి వైరస్ నివారణకు వ్యాక్సిన్ రూపొందిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ను కనిపెడితే మరోసారి భారత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. త్వరలోనే వ్యాక్సిన్ మన సంస్థలు ఆవిష్కరించాలని కోరుకుందాం.