Begin typing your search above and press return to search.
ఆరు నెలలు ఆగితే..పక్కాగా వ్యాక్సిన్..ఎవరు చెప్పారంటే?
By: Tupaki Desk | 20 July 2020 4:45 AM GMTమొన్నటి వరకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నా.. గుండెల్లో దడ పుట్టలేదు. కారణంగా పాజిటివ్ కేసులు మహానగరాల్లో తీవ్రస్థాయిలో.. మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరుగానే నమోదు అయ్యాయి. గడిచిన వారంలో మాత్రం అందుకు భిన్నంగా వేర్వేరు ప్రాంతాల్లో కేసుల సంఖ్య భారీగా పెరగటమే కాదు.. రోజు గడిచే కొద్దీ నమోదవుతున్న కేసుల సంఖ్య విన్నంతనే చెమటలు పట్టేలా మారింది. వైరస్ కు చెక్ పెట్టేందుకు దేశీయంగా పలు సంస్థలు వ్యాక్సిన్ తయారీ కోసం పలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇదిగో వచ్చేస్తోంది.. అదిగో వచ్చేస్తోందని వ్యాక్సిన్ గురించి వార్తలు వస్తున్నా.. అవేమీ ఇప్పట్లో రావన్న నిజాన్ని తాజాగా సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటనను చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. వ్యాక్సిన్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్న దానిపై తాజాగా ఆ సంస్థ చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది చివరకు (డిసెంబరులో) మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసేందుకు దేశంలో మొత్తం ఏడు దేశీయ సంస్థలు ముందంజలో ఉన్నట్లుగా చెబుతున్నారు. తమ సంస్థ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుతుందని ఆస్ట్రోజెనెకా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పై పని చేస్తున్నట్లుగా సీరమ్ చెప్పింది. ఆగస్టులో మనుషులపై ప్రయోగాలు చేయనున్నట్లు చెప్పింది. ఇప్పుడు జరుపుతున్న పరీక్షల నేపథ్యంలో ఈ ఏడాది చివరకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్‌ను 100 కోట్ల డోసుల ఉత్పత్తి, సరఫరా నిమిత్తం ఆస్ట్రాజెనెకాతో తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ వ్యాక్సిన్ ను భారత్ తో పాటు.. తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో అందుబాటులో ఉండేలా చేస్తారు. నెలల వ్యవధిలోనే ఈ వ్యాక్సిన్ తయారీ కోసం భారత్ కు చెందిన ఏడు సంస్థలు పగలు..రాత్రి అన్న తేడా లేకుండా పని చేస్తున్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ కు చెందిన భారత బయోటెక్ సంస్థ వ్యాక్సిన్ తయారీలో ముందుండటం తెలిసిందే.
ఇప్పటికే ఆ సంస్థ తాము డెవలప్ చేసిన వ్యాక్సిన్ నమునాల్ని క్లీనికల్ టెస్టుల్ని షురూ చేశారు. ఈ వ్యాక్సిన్ ఆగస్టు 15 నాటికి లాంఛ్ చేస్తారని ప్రచారం జరిగినా.. వాస్తవంలో అది సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేనట్లే. ఈ ఏడాది చివరకు కానీ.. వచ్చే ఏడాది మొదట్లో మాత్రమే మార్కెట్లోకి రానుంది. అంటే.. దాదాపు ఆరేడు నెలలు అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా చోటు చేసుకున్నా.. తీవ్ర ఇబ్బందులకు గురి కాక తప్పదు. సో.. అందరూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.