Begin typing your search above and press return to search.

ప్రపంచంలో రెండోస్థానానికి భారత్!!

By:  Tupaki Desk   |   20 July 2020 4:30 AM GMT
ప్రపంచంలో రెండోస్థానానికి భారత్!!
X
దేశంలో కరోనా కల్లోలంగా మారింది. ఉగ్రరూపం దాలుస్తోంది. ఊహకందని స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. చూస్తుంటే కమ్యూనిటీ స్ప్రెడ్ స్థాయికి చేరినట్టే తెలుస్తోంది.

గతవారం ఏకంగా 2.38 లక్షలమందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. అలాగే దేశంలో 4285 మరణాలు చోటుచేసుకున్నాయి.

ఆదివారం కరోనా విజృంభించింది. ఏకంగా గడిచిన 24 గంటల్లో దేశంలో 40వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి మరో 673 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటింది. 10 లక్షలకు మూడు రోజుల్లోనే చేరిన కేసులు ఆ తర్వాత సోమవారం నాటికి మొత్తం కేసులు 11.17లక్షలకు చేరాయి. మరణాలు 27500కు చేరాయి.

ఆదివారం అత్యధికంగా మహారాష్ట్రలో 9518మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 5041మందితో రెండో అత్యధికం నమోదైంది. మహారాష్ట్ర తర్వాత ఏపీలోనే 5వేల కేసులు ఒక్కరోజులో దాటడం గమనార్హం.

*ఆంధ్రప్రదేశ్ లో..
ఏపీలో రికార్డ్ స్థాయిలో ఒకేరోజు అత్యధిక కేసులు.. మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం 5041 మందికి పాజిటివ్ గా తేలింది. ఒక్కరోజులోనే రాష్ట్రవ్యాప్తంగా 56మంది మృతిచెందడం కలకలం రేపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49,650కి చేరగా.. మృతుల సంఖ్య 642కి చేరాయి.

*తెలంగాణలో తగ్గిన తీవ్రత
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. నిన్న ఆదివారం కొత్తగా 1296 కేసులు నమోదయ్యాయి. మరో ఆరుగురు ఆదివారం వైరస్ తో మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 45వేలు దాటింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున టెస్టులు చేస్తున్నారు. కేసుల సంఖ్య తగ్గడం ఊరట కలిగిస్తోంది.