Begin typing your search above and press return to search.

దేశంలో కరోనా కల్లోలం!

By:  Tupaki Desk   |   17 July 2020 5:15 AM GMT
దేశంలో కరోనా కల్లోలం!
X
దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. గురువారం వైరస్ వ్యాప్తిలో భారత్ రెండు రికార్డులు అధిగమించింది. పాజిటివ్ కేసుల సంఖ్య మిలియన్ మార్క్ దాటింది. కరోనా మరణాలు 25వేలు దాటాయి.

దేశవ్యాప్తంగా గురువారం 36వేలమందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఒక్కరోజులో 684మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోనే కరోనా వైరస్ మొదలైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు.. మరణాలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

అమెరికా, బ్రెజిల్ తర్వాత 10 లక్షలు దాటిన మూడో దేశంలో భారత్ తాజాగా అవతరించింది. కరోనా దేశంలో ఎంత విస్తృతి అంటే కేవలం ఆరు రోజుల్లోనే ఆరు లక్షల నుంచి 10 లక్షల కేసులకు చేరాయి. అంతకుముందు రెండు లక్షలు పెరగడానికి 9 రోజులు పట్టగా.. ఈసారి మూడు రోజులు పట్టింది.

గురువారం దేశంలో 36139 మందికి కొత్త వైరస్ గా నిర్ధారణ అయ్యింది. బుధవారం పోల్చితే ఈ సంఖ్య 3600 అధికం. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 10,04,806కు చేరింది. మరణాల సంఖ్య 25609గా నమోదైంది.

*దేశంలో మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 2.84 లక్షలకు చేరింది. 11వేల మంది చనిపోయారు.మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , యూపీ, బెంగాల్, బీహార్, కేరళలలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

*ఇక ఏపీలో కొత్తగా 2593 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 1676 కేసులు బయటపడ్డాయి. 10మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 40వేలకు చేరాయి.