Begin typing your search above and press return to search.
పాజిటివ్ రాకపోయినా లక్షణాలుంటే ట్రీట్మెంట్
By: Tupaki Desk | 13 July 2020 6:30 AM GMTకరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని భయంతో వణికిస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటి 30 లక్షలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రోజురోజుకి ఈ మహమ్మారి కేసులు పెరుగుతూనే పోతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఇక కరోనా సంబంధించిన లక్షణాలు కనిపించగానే ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే ఈ మధ్య కాలంలో వైరస్ పై పోరాడుతూ ..కరోనా భాదితులకు ట్రీట్మెంట్ చేసేవారు కూడా ఎక్కువగా ఈ వైరస్ భారిన పడుతున్నారు. దీనితో ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ల బృందాలు కూడా భయపడుతున్నాయి.
ఇకపోతే , ఇప్పటివరకు ఈ కరోనా మహమ్మారి లక్షణాలు బాడీలో కనిపిస్తే వారిని కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించి ..పాజిటివ్ వస్తే హాస్పిటల్ కి తరలించి ఐసోలేషన్ లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు . నెగటివ్ వస్తే బయట తిరగకుండా ఇంట్లోనే ఉండాలని జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నారు. ఐతే, తాజాగా నెగటివ్ వచ్చిన వారిలో కూడా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. వారిలో కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ టెస్టుల్లో నెగటివ్ అని వస్తుంది. దీనితో ఆ ఫలితం తో సంబంధం లేకుండా టెస్టుల్లో నెగటివ్ వచ్చినా కూడా లక్షణాలు కనిపిస్తే ట్రీట్మెంట్ ఇవ్వాలని వైద్యులు చెప్తున్నారు. తొలుత కరోనా నెగటివ్ వచ్చి ..ఆ తరువాత వారికీ పాజిటివ్ వచ్చిన సంఘటలు చాలా ఉన్నాయని తెలిపారు. RT - PCR టెస్టుల్లో దాదాపుగా 70 శాతం ఫలితాలు నిజం అవుతున్నాయి అని , ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో కేవలం 40 శాతం మాత్రమే నిజం అవుతున్నాయని తెలిపారు.