Begin typing your search above and press return to search.

ఈ సింఫుల్ టెక్నిక్స్ పాటిస్తే కరోనా దరి చేరదట

By:  Tupaki Desk   |   11 July 2020 9:10 AM GMT
ఈ సింఫుల్ టెక్నిక్స్ పాటిస్తే కరోనా దరి చేరదట
X
రోజురోజుకి విస్తరిస్తున్న కరోనా దరి చేరకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముఖానికి మాస్కు పెట్టుకోవటం.. భౌతిక దూరాన్ని పాటించటం.. శానిటైజ్ చేసుకోవటం లాంటి సలహాలు ఇస్తారు. మనమెంత జాగ్రత్తగా ఉన్నా.. ఎవరో ఒకరు చేసే ఏదో ఒక తప్పుకు బాధితులు కావాల్సిన దుస్థితి. ఇలాంటివేళ.. ఎవరికి వారు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సింఫుల్ టెక్నిక్ లతో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు వీలుగా కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందన్న మాట నిపుణులు చెబుతున్నారు.

ఆయుర్వేదంలో కరోనాలాంటి విపత్కర జబ్బుల్ని ఎదుర్కొనేందుకు.. అలాంటివి దరి చేరకుండా ఉండేందుకు కొన్నింటిని పాటిస్తే సరిపోతుందన్న మాటను పలువురు చెబుతున్నారు. ఇంట్లో ఉండే వస్తువులతో కాస్త శ్రమపడితే మాయదారి రోగం దరి చేరకుండా ఉంటుందని చెబుతున్నారు. ఎవరికి వారు చేసుకునే వీలున్న ఈ చిట్కాల్ని చూస్తే..

- యోగా.. వ్యాయామాలు చేయటం
- గోరువెచ్చని నువ్వుల నూనె రెండేసి చుక్కలు చొప్పున రెండు ముక్కుపుటాల్లో వేసి పది నిమిషాలు వెల్లకిలా పడుకోవాలి. అరగంట తర్వాత వేడినీటితో స్నానం చేయాలి (నువ్వుల నూనె నాణ్యమైనది.. మంచి బ్రాండెడ్ వాడాలన్నది మర్చిపోకూడదు)
- బాగా కాచిన కప్పు వేడి పాలల్లో అరచెంచా పసుపు కలిపి తాగాలి
- వేపాకులు లేదా సాంబ్రాణి పొగను ఇంట్లో వేయాలి
- జీర్ణశక్తిని పెంచే ఆవాలు.. జీలకర్ర.. ధనియాలు.. అల్లం.. వెల్లుల్లిని వంటల్లో ఎక్కువగా వినియోగించాలి
- తేలిగ్గా అరిగే ఆహారాన్ని తీసుకోవటం మంచిది.
- ఆహారం వేడివేడిగా తినాలి
- కప్పు నీటిని మరిగించాలి. అందులో రెండు చిటికెల మిరియాలపొడి.. చిటికెడు లవంగాల పొడి.. దాల్చినచెక్క పొడి వేసి బాగా కాయాలి. చివర్లో అయిదారు తులసి ఆకులు కూడా వేయాలి. దీనికి చెంచాడు తేనె కలిపి తాగితే మంచిది. కాకుంటే ఈ కషాయాన్ని ప్రతిరోజు సాయంత్రం తీసుకోవాలి. 30-40మి.లీ. చొప్పున రోజుకు రెండుసార్లు మాత్రమే తాగాలి. ఎక్కువ తాగకూడదు.
ఏ మాత్రం చేయకూడనివి
- ఫ్రిజ్ లోని చల్లని నీళ్లు
- కూల్ డ్రింక్స్
- స్వీట్లు.. పెరుగు లాంటివి తగ్గించాలి