Begin typing your search above and press return to search.
కరోనా అప్డేట్ :ఒక్కరోజే 24,248 కేసులు..మూడో స్థానానికి భారత్!
By: Tupaki Desk | 6 July 2020 5:00 AM GMTప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇండియాలో కూడా విలయతాండవం చేస్తుంది. ప్రభుత్వం ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. తాజాగా దేశంలో గత 24 గంటల్లో మరో 24248 కేసులు రావడంతో... మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలకు చేరువై... 697287గా నమోదైంది. మొత్తం వైరస్ తో మృతి చెందినవారి సంఖ్య 19,693కు పెరిగింది. దేశంలో వైరస్ నుంచి కోలుకుంటున్న బాధితుల సంఖ్య పెరగడం కాస్త ఊరట కలిగించే అంశం. ఇప్పటివరకు 4,24,433మంది వ్యాధి బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
అలాగే... ప్రస్తుతం 253287 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 60.9 శాతంగా ఉండగా... మరణాల రేటు 2.8 శాతంగా ఉంది. ప్రపంచ మరణాల రేటు 8 శాతంగా ఉంది. అంటే ప్రపంచ దేశాలతో పోల్చితే ఇండియాలో వైరస్ మరణాలు తక్కువగానే ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 180596 టెస్టులు జరపడంతో మొత్తం టెస్టుల సంఖ్య 9969662కి పెరిగింది. టెస్టుల సంఖ్య పెరుగుతుంటే... పాజిటివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది.
ప్రస్తుతం దేశంలో మహారాష్ట్రలో మహమ్మారి కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. మహారాష్ట్ర లో కేసుల సంఖ్య 206619గా ఉండగా... తమిళనాడులో 111151గా నమోదయ్యాయి. ఢిల్లీలో 99444 - గుజరాత్ లో 36037 - ఉత్తరప్రదేశ్ లో 27707 - తెలంగాణ లో 23902 - కర్ణాటకలో 23474 - బెంగాల్ లో 22126 - రాజస్థాన్ లో 20164 కేసులు నమోదయ్యాయి. ఈ జాబితాలో తెలంగాణ ఆరోస్థానం లో ఉండటం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆందోళన కలిగించే విషయం. ఏపీలో ప్రస్తుతం 18697 పాజిటివ్ కేసులున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కేసులున్న దేశాల్లో అమెరికా - బ్రెజిల్ తర్వాత. రష్యాను నాలుగోస్థానానికి నెట్టి ఇండియా మూడోస్థానానికి చేరింది.