Begin typing your search above and press return to search.

ఆగస్టుకు వ్యాక్సిన్: ఐసీఎంఆర్ ఛాలెంజ్

By:  Tupaki Desk   |   6 July 2020 4:30 AM GMT
ఆగస్టుకు వ్యాక్సిన్: ఐసీఎంఆర్ ఛాలెంజ్
X
వచ్చే ఏడాది వరకు కరోనాకు వ్యాక్సిన్ కష్టమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్.వో) ప్రకటించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పై పరిశోధనలు ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ వర్సిటీ టీకా కూడా వచ్చే అక్టోబర్ వరకు అందుబాటులోకి తెస్తామంటోంది.

కానీ మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మాత్రం భారత స్వాతంత్ర్య దినోత్సవం నాటికే అందుబాటులోకి తెస్తామని సంచలన ప్రకటించింది. కానీ నిపుణులు, మేధావులు మాత్రం క్లినికల్ ట్రయల్స్ రెండు నెలల్లో పూర్తి చేయడం అసాధ్యమని.. ఇలా ఆగమాగం చేస్తే వ్యాక్సిన్ సాధ్యం కాదని.. మనుషులపై క్లినికల్ ట్రయల్స్ కు సుధీర్ఘ సమయం పడుతుందని ఆరోపించారు. ఇదంతా వట్టి ట్రాష్ అన్నారు.

అయితే తాజాగా తమపై వస్తున్న విమర్శలపై ఐసీఎంఆర్ స్పందించింది. తమను తక్కువగా అంచనా వేయవద్దని.. అంతర్జాతీయ ప్రమాణాలతోనే వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నామని.. ఇప్పటికే జంతువులపై, మనుషుల మీద ప్రయోగాలు సమాంతరంగా చేస్తున్నామని తెలిపింది. ఆగస్టు 15 నాటికి ఖచ్చితంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని తెలిపింది.

ఐసీఎంఆర్ ఇలా బల్లగుద్ది మరీ వ్యాక్సిన్ వస్తుందని తెలుపడం నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా వస్తే మాత్రం ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ తయారుచేసిన దేశంగా భారత దేశ ఖ్యాతి ఇనుమడిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.