Begin typing your search above and press return to search.
కరోనా: భారత్ లో 24గంటల్లో 21వేల కేసులు
By: Tupaki Desk | 3 July 2020 6:03 AM GMTదేశంలో కరోనా విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా రోజుకు 20వేలకు దగ్గరగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఈ సంఖ్య 20వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 20903 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా బయటపడ్డాక ఒక్కరోజులోనే నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,25,544కు చేరింది. నిన్న ఒక్కరోజే 379మంది మృతిచెందారు. శుక్రవారం నాటికి దేశంలో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 18213కి చేరింది.
*మహరాష్ట్ర, తమిళనాడుల్లో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. తమిళనాడులో నిన్న ఒక్కరోజే 4343 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తమిళనాడులో మొత్తం కరోనా బాధితుల సంఖ్య లక్షకు చేరువైంది. 1321మంది చనిపోయారు.
*ఇక దేశంలోనే మహారాష్ట్ర లో కేసుల సంఖ్య లక్షా 86వేలకు చేరింది. మరణాల సంఖ్య 8178 మంది ఇప్పటిదాకా కరోనాతో మరణించారు.
*ఢిల్లీలో 92175 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 2864 మంది మృత్యువాత పడ్డారు.
*గుజరాత్ లో కేసుల సంఖ్య 33913కు చేరింది. ఇప్పటివరకు 1886మంది చనిపోయారు.
*ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచంలో 27లక్షల కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత 15 లక్షల కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఇక రష్యా 6.60 లక్షల కేసులతో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం వీరి తర్వాత 4వ స్థానంలో భారత్ నిలిచింది. మరణాల్లో మాత్రం ప్రపంచంలో భారత్ 8వ స్థానంలో ఉంది.
*తెలంగాణలో..
తెలంగాణలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. విచ్చలవిడిగా విస్తరిస్తోంది. హైదరాబాద్ లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. తాజాగా తెలంగాణలో కరోనా రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు నమోదు కానీ రీతిలో గడిచిన 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గురువారం 1213 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 18570 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో తెలంగాణలో మరో ఎనిమిది మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 275కు చేరుకుంది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే ఈ కేసులు 998కి చేరాయి.
దీంతో తెలంగాణ రాష్ట్రం రాజస్థాన్ ను అధిగమించి అత్యధిక కేసులున్న రాష్ట్రాల జాబితాలో ఏడో స్థానానికి చేరింది. తక్కువ పరీక్షలు చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో తాజాగా నిన్న 5356 పరీక్షలు నిర్వహించినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపిందే.
*ఏపీలో పెరుగుతున్న కరోనా
ఏపీలో కరోనా కేసుల సంఖ్య 15252కి చేరింది. ఇప్పటిదాకా కరోనాతో 193మంది మరణించారు. ఇందులో 6988మంది కరోనానుంచి కోలుకొని బయటపడ్డారు. 8071 యాక్టివ్ కేసులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.