Begin typing your search above and press return to search.
మార్చి..ఏప్రిల్ మహమ్మారికి మే..జూన్ లోని దానికి సంబంధం లేదా?
By: Tupaki Desk | 2 July 2020 12:30 AM GMTమాయాదారి రోగానికి కారణమైన వైరస్ కు సంబంధించిన కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. పేరుకు కొవిడ్ 19 అయినా.. దాని లక్షణాలు అంతకంతకూ రూపాంతం చెందుతున్నాయి. ఇలాంటి మార్పుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తే తప్పించి.. సరైన వ్యాక్సిన్ కనుగొనే అవకాశం ఉండదు. ఇదిలా ఉంటే.. భారత్ లోనూ.. తెలంగాణలోనూ ఎలాంటి వైరస్ వ్యాప్తి చెందుతోంది? అదెలా రూపాంతం చెందుతుందన్న పరిశోధనల్్ని పలు సంస్థలు చేస్తున్నాయి. అందులో సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ తో పాటు సీసీఎంబీ గుర్తించింది. కొవిడ్ 19 జన్యుక్రమాల్ని విశ్లేషించే క్రమంలో ఆసక్తికర అంశాల్ని గుర్తించారు.
వెయ్యికి పైగా వైరస్ నమూనాల జన్యుక్రమాల్ని కనుగొన్న తర్వాత.. తాజాగా గుర్తించిన విషయం ఏమంటే.. మార్చి.. ఏప్రిల్ లో కనిపించిన వైరస్ జన్యుక్రమానికి.. మే.. జూన్ లోని వాటికి మార్పు ఉందని గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం పదకొండు రకాల వైరస్ సమూహాలు వ్యాప్తి చెందుతున్నట్లుగా పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా మన దేశంలో రెండు రకాలకు చెందినవి ఉన్నట్లుగా తేల్చారు.
మార్చి నెలలో ఏ2ఏ.. ఏ3.. ఏ3ఐ.. బీ1.. బీ4.. ఏ1ఏ రకాల సమూహాల వ్యాప్తి ఉన్నట్లు గుర్తించారు. ఏప్రిల్ నాలుగో వారం నుంచి ఏ2ఏ రకం వ్యాప్తి ఎక్కువగా ఉంది. మేలో మొదటి రెండు వారాల్లో మాత్రం ఏ2ఏ తో పాటు బీ4, ఏ2 రకాలు ఎక్కువ గా ఉన్నాయి. ఇందుకు భిన్నం గా మే మూడోవారం నుంచి జూన్ రెండో వారం వరకూ ఏ2ఏ తప్పించి మిగిలిన వాటి ఉనికి పెద్ద గా లేదని విశ్లేషించారు. మన దగ్గర గుర్తించిన ఏ2ఏ వైరస్ రకం వ్యాప్తే ప్రపంచ వ్యాప్తం గా అరవై శాతానికి మించి ఉందని తేల్చారు. ప్రస్తుతానికి ఎక్కడెక్కడ ఏయే వైరస్ లు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించిన శాస్త్ర వేత్తలు.. అందు లో వేటి తీవ్రత ఎంత? అన్న విషయంపై మదింపు చేయాల్సి ఉంది.