Begin typing your search above and press return to search.
వైరస్ అప్డేట్: దేశంలో ఆరు లక్షలకు చేరువలో.. కోటి దాటిన ప్రపంచం
By: Tupaki Desk | 1 July 2020 6:45 AM GMTదేశంలో వైరస్ విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తం గా కేసులు కోటి మార్క్ ను దాటగా దేశం లో కేసులు ఆరు లక్షలకు దూసుకెళ్తున్నాయి. రోజురోజుకు కేసులు భారీ గా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 18,653 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 5,85,493కి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 2,20,114కు చేరాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు.
ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకున్న వారు 3,47,979 మంది ఉన్నారు. కొత్తగా 24 గంటల్లో వైరస్ తో బాధపడుతూ మృతి చెందిన వారి సంఖ్య 507. వీటితో కలిపి ఇప్పటివరకు మృతుల సంఖ్య 17,400. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.
కోటి దాటిన ప్రపంచం
ప్రపంచవ్యాప్తంగా వైరస్ విజృంభణ తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య కోటి దాటింది. మొత్తం కేసులు 1,05,86,381కి చేరాయి. మొత్తం మరణాల సంఖ్య ఐదు లక్షలు దాటగా.. 5,13,925కి చేరింది. ప్రపంచంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 42,76,558 ఉండగా, రికవరీ కేసుల సంఖ్య 57,95,898 గా ఉంది. అమెరికా, బ్రెజిల్‌లో కరోనా వైరస్ జోరు ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా అమెరికాలో 14,54,397 యాక్టీవ్ కేసులు ఉండగా బ్రెజిల్‌లో 5,58,789 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.