Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ దేశానికి చేరితే మొదట ఇచ్చేదెవరికంటే?

By:  Tupaki Desk   |   1 July 2020 5:00 AM GMT
వ్యాక్సిన్ దేశానికి చేరితే మొదట ఇచ్చేదెవరికంటే?
X
దేశ ప్రజల్ని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంలో పలు కీలక అంశాల్ని ప్రస్తావించటం తెలిసిందే.ప్రపంచ వ్యాప్తంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైరస్ కు చెక్ పెట్టేందుకు వీలుగా పెద్ద ఎత్తున పరిశోధనలు సాగుతున్నాయి. ఇప్పటికే రెండు.. మూడుదశల్ని దాటిన క్లీనికల్ పరీక్షల కారణంగా రానున్న రెండు.. మూడునెలల్లో వ్యాక్సిన తప్పని సరిగా వస్తుందన్న ఆశా భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వ్యాక్సిన్ రాక మీద క్లారిటీ లేనప్పటికీ.. వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఎవరికి ముందు వాడాలన్న విషయం మీద ప్రధాని మోడీ తాజాగా క్లారిటీ ఇచ్చేశారు. వ్యాక్సిన ధర అందుబాటు లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు చెప్పిన ఆయన.. దేశానికి వ్యాక్సిన్ వచ్చినంతనే ఆరోగ్య కార్యకర్తలకు మొదట ఇవ్వాలన్నారు. తాను చెప్పిన విషయాన్ని పరిగణ లోకి తీసుకొని.. ప్రణాళిక ను సిద్ధం గా ఉంచుకోవాలన్నారు.

తొలుత ఆరోగ్య కార్యకర్తలకు.. ఆ తర్వాత వైద్యులు.. నర్సులు.. పారా మెడికల్ సిబ్బందితో పాటు నాన్ మెడికల్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందజేయాలని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ చేసేందుకు అవసరమైన సరైన ప్రణాళికను ముందస్తుగానే సిద్దం చేసుకోవాలన్నారు. వ్యాక్సిన వచ్చే సంగతి ఎలా ఉన్నా.. ఎవరికి ముందు ఇవ్వాలి? ఎవరికి కాస్త ఆలస్యంగా ఇవ్వొచ్చన్న విషయం చాలా కీలకం. దీన్ని ముందే గుర్తించటం ద్వారా మరో రచ్చకు తెర దించారని చెప్పాలి. మోడీ మాటలు ఏ మేరకు అమలవుతాయన్నది ఇప్పుడు ఆసక్తి కరమని చెప్పక తప్పదు.