Begin typing your search above and press return to search.
మరో 10 రోజుల్లో 2 లక్షల కేసులు
By: Tupaki Desk | 22 Jun 2020 10:50 AM GMTఇండియా లో వైరస్ విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా మరో 14821 వైరస్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 425282కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 445 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 13699కి పెరిగింది. అయితే, రికవరీల రేటు కాస్త పెరిగింది. తాజాగా 9440 మంది రికవరీ అవ్వడంతో మొత్తం రికవరీ కేసుల సంఖ్య 237195గా మారింది. ప్రస్తుతం రికవరీ రేటు 55.8 శాతంగా ఉంది.
తొలుత చాలా నెమ్మదిగా ప్రారంభమైన మహమ్మారిసంక్రమణం.. లాక్ డౌన్ సడలింపులతో ఊపందుకుంది. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలకు మహమ్మారివ్యాపించింది. కొన్ని ప్రాంతాల్లో ఒక్కోసారి జోరు బాగా తగ్గినట్లు కనిపిస్తున్నా, మరోసారి బాగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యధికంగా 132075 పాజిటివ్ కేసులున్నాయి. ఆ తర్వాత ఢిల్లీలో 59746 కేసులు, తమిళనాడులో... 59377 కేసులు, గుజరాత్‌లో 27260 కేసులు, రాజస్థాన్ 14930, బెంగాల్ 13945, మధ్యప్రదేశ్ 11903, హర్యానా 10635 కేసులతో టాప్ 8లో ఉన్నాయి.
ఇకపోతే , దేశంలో రానున్న 10 రోజుల్లో కొత్తగా 2 లక్షల కరుణ కేసులు నమోదయ్యాయి అవకాశం ఉందని మిచిగాన్ యూనివర్సిటీ అంచనా వేసింది. గత కొద్ది రోజులుగా దేశంలో నమోదవుతున్న కేసుల సంఖ్య ను చూస్తుంటే జూలై 1 నాటికి ఆరు లక్షల కేసులు నమోదు అవుతాయి యూనివర్సిటీకి చెందిన భారత సంతతి ప్రొఫెసర్ బ్రమర్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. దేశ జనాభాలో కరుణ కేసుల సంఖ్య 0.5 శాతం కూడా లేదని, మిగిలిన దేశాలలో ఆ సంఖ్య నాలుగు శాతంగా ఉందని తెలిపారు.