Begin typing your search above and press return to search.
లేటెస్ట్ అప్డేట్ : ఒక్కరోజే ఒకేరోజు 15413 కేసులు
By: Tupaki Desk | 21 Jun 2020 7:10 AM GMTప్రపంచ వ్యాప్తంగా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. అదే సమయంలో... కరోనాను జయించగలమనే కాన్ఫిడెన్స్ కూడా ప్రజల్లో పెరుగుతోంది. భారతదేశంలో గత 24 గంటల్లో ఏకంగా 15413 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షలు దాటి... 410461కి చేరింది. నిన్న 306 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 13254కి చేరింది. ఇండియాలో వైరస్ వల్ల ఒకే రోజు ఇంత ఎక్కువ మంది చనిపోవడం ఇదే తొలిసారి.
గత 24 గంటల్లో 13925 మంది రికవరీ అవ్వడంతో మొత్తం రికవరీ కేసుల సంఖ్య 227755కి చేరింది. ఫలితంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 169451గా ఉంది. దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి 55.5కి చేరుకోవడం మంచి విషయమే. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ క్లోజింగ్ కేసుల్లో మరణాల రేటు 9 శాతంగా ఉంది. ఇండియాలో అది 3.2 శాతంగా ఉండటం మనకు ఊరట కలిగించే విషయం. తాజాగా ఇండియాలో వైరస్ ను జయించేందుకు టాబ్లెట్ల మందు ఫాబిఫ్లూకి అనుమతి లభించడం కూడా వైరస్ పై చిన్నపాటి విజయం గానే చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసుల్లో భారత్ 4వ స్థానం లో ఉంది. కొత్త కేసుల నమోదులో 3వ స్థానంలో ఉంది. ఇకపోతే , ఏపీలో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 491 పాజిటివ్ కేసులో నమోదయ్యాయి. మరో ఐదుగురు ఈ మహమ్మారి కారణంగా చనిపోయారు. రాష్ట్రంలో వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య 101కి చేరింది. కొత్త కేసులతో కలుపుకుని ఏపీలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 8452కు చేరింది. ఇక గడిచిన ఒక రోజు వ్యవధిలో 138 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4111కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారితో కలిపి మొత్తం 4240 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తెలంగాణలో వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ రోజు రాష్ట్రం లో ఏకంగా 546 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 458 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం వైరస్ కేసుల సంఖ్య 7072కు చేరింది. వైరస్ మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇవాళ వైరస్ తో ఐదుగురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 203కు చేరింది.