Begin typing your search above and press return to search.

టీకా వేయించుకోండి.. బంగారు ముక్కుపుడక తీసుకెళ్లండి

By:  Tupaki Desk   |   7 April 2021 2:30 PM GMT
టీకా వేయించుకోండి.. బంగారు ముక్కుపుడక తీసుకెళ్లండి
X
కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొదటి వేవ్ వచ్చి వెళ్లినంతనే యుద్ధంలో గెలిచామంటూ తెగ సంబరపడిపోవటమే కాదు.. దూరాన ఉన్న అమెరికా ఇబ్బందిని చూసి నవ్వుకున్న వారెందరో. మహమ్మారిని భారతీయులు తరిమి కొట్టగలిగారని.. అగ్రరాజ్యానికి మాత్రం అది చేతకావటం లేదని విరుచుకుపడినోళ్లు లేకపోలేదు. అయితే.. మొదటి వేవ్ కు.. రెండో వేవ్ కు మధ్య గ్యాప్ లో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి.. అజాగ్రత్తగా ఉండటం ఇప్పుడు కొంప ముంచుతోంది. మరోవైపు కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ వచ్చిందనే కానీ.. దాని మీద ఉన్న అపోహలతో టీకా వేయించుకోవటానికి చాలా మంది ఆసక్తి చూపించని పరిస్థితి. దీంతో.. దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి.

ఇలాంటివేళ వ్యాక్సిన్ మీద ప్రజలు ఫోకస్ పెట్టేందుకు వీలుగా రాజ్ కోట్ స్వర్ణకార సంఘం వారు అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా కేసుల నేపథ్యంలో.. వీలైనంత మంది వ్యాక్సిన్ వేయించుకోవటం ద్వారా వైరస్ వ్యాప్తిని అదుపు చేయొచ్చన్న ఆలోచనలో ఉన్న వారు.. ఊహించని ఆఫర్ ను తెర మీదకు తీసుకొచ్చారు. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంటే.. దానికి కాస్త అటు ఇటుగా గుజరాత్ కూడా ఉంది.

దీంతో.. ప్రజల్లో టీకా మీద అవగాహన పెంచేందుకు వీలుగా గుజరాత్ లోని రాజ్ కోట్ స్వర్ణకార సంఘం వారు సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చేవారు. వ్యాక్సిన్ వేయించుకునే మహిళలకు ఉచితంగా బంగారు ముక్కుపడకలు.. పురుషులకు హ్యాండ్ బ్లండర్లను కానుకగా ఇవ్వాలని నిర్ణయించారు. తమకు మాదిరే.. దేశంలోని ఇతర కార్పొరేట్ సంస్థలు.. సహకార సంఘాలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు వారు 751 మంది మహిళలకు ముక్కుపడకలు.. 580 మంది పురుషులకు బహుమతులు అందజేశారు. ఇదేదో బాగున్నట్లుందే. మరి.. రాజ్ కోట్ వారిని స్ఫూర్తిగా తీసుకునే వారెందరో చూడాలి.