Begin typing your search above and press return to search.
ఒకప్పటి ఆదర్శ రాష్ట్రం ఇప్పుడు మరణాల్లో టాప్
By: Tupaki Desk | 14 Jun 2020 12:30 AM GMTదేశంలోనే ఆదర్శ రాష్ట్రం.. ఆ రాష్ట్రం మాదిరి దేశం మారుతుంది. అందుకే నరేంద్ర మోదీకి ఓటేసి గెలిపించండి అంటూ తొలిసారి బీజేపీ పార్టీ పేరు ప్రస్తావించకుండా వ్యక్తి పేరుతో ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. ప్రస్తుతం రెండో దశ పాలన సాగుతోంది. ఈ సమయంలో మహమ్మారి వైరస్ ప్రబలి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టింది. వైరస్ కట్టడి చర్యలు ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో విఫలమైంది. ప్రధానంగా గుజరాత్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వైరస్ మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గుజరాత్ మోడల్ వైరస్ విషయంలో విఫలమైందా అనే ప్రశ్నలు ప్రత్యర్ధుల నుంచి వస్తున్నాయి.
వైరస్ దెబ్బకు ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం విమర్శల పాలవుతోంది. కేసుల సంఖ్యలో దేశంలోనే నాలుగో స్థానంలో ఉండటం, మరణాల రేటు అధికంగా ఉండటం బీజేపీ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసింది.
అహ్మదాబాద్ ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. రోగులకు తగిన విధంగా చికిత్స అందించడం లేదని అస్పత్రిపై ఆరోపణలు వచ్చాయి. 490 మందికి పైగా ప్రాణాలు పోవడంతో హైకోర్టు ఆ ఆస్పత్రిని ఓ చీకటి కొట్టంగా వ్యాఖ్యానించింది. వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
పశ్చిమ గుజరాత్‌లో అతి పెద్ద నగరం అహ్మదాబాద్. సుమారు 70లక్షల జనాభా ఉంటుంది. ఈ నగరంపై వైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో 75శాతం ఇక్కడే ఉన్నాయి. ముఖ్యంగా మరణాలు అధికంగా ఉన్నాయి.
గుజరాత్ 21,500 కేసులతో దేశంలోనే నాల్గో స్థానంలో ఉంది. వ్యాధి సోకిన వారిలో మరణాల శాతం మాత్రం 6.2. దేశంలోని సరాసరితో పోల్చితే ఇది 2.8శాతం ఎక్కువ. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పదే పదే దిల్లీలో జరిగిన మత సమావేశాలకు హాజరైన వారిని, విదేశీయుల్నే తప్పుపడుతూ వచ్చారు. అయితే ఇది కేవలం గుజరాత్‌కు మాత్రమే పరిమితం కాలేదు కదా ఇతర పార్టీల నాయకులు చెబుతున్నారు. అలాంటి వారిని చాలా మందిని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం వారికి చికిత్స అందించిందని గుర్తు చేస్తున్నారు. ఒక వేళ ఇదే కారణం అనుకుంటే గుజరాత్‌లో మాత్రమే మరణాల సంఖ్య ఎక్కువగా ఎందుకు ఉన్నట్టు ప్రశ్నిస్తున్నారు.
ఓ వైపు ప్రైవేటు ఆస్పత్రులు వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు నిరాకరిస్తున్నారని.. ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు చాలామంది ఇష్టబడటం లేదని వైద్యులు అంటున్నారు. సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండడంతో ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నారు.గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఇప్పటికీ పరీక్షల సంఖ్య తక్కువగానే ఉందని ఆరోపణలు ఉన్నాయి. అందుకే కేసుల కన్నా మరణాలు అధికంగా నమోదవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. వైరస్ దెబ్బకు రాష్ట్రంలోని వైద్య సౌకర్యాలు ఎంత ఘోరంగా ఉన్నాయో అందరికీ తెలిసిందని ఇతర పార్టీల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. గుజరాత్‌లో ప్రతి వెయ్యి మందికి కేవలం 0.3 బెడ్స్ మాత్రమే ఉన్నాయని. ఇదే జాతీయ స్థాయిలో సగటు 0.55గా ఉందని ఇటీవల జరిగిన అధ్యయనాల్లో తేలింది.
కేసుల సంఖ్య భారీగా పెరగడానికి ఆస్పత్రుల్లో బెడ్స్ లేకపోవడం, తగినన్ని పీపీఈ కిట్లు అందుబాటులో లేకపోవడం, క్వారంటైన్ సౌకర్యాలు లేకపోవడం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. మరణాల రేటు విషయంలో మాత్రం గుజరాత్ పరిస్థితి ఘోరంగానే ఉంది.
అయితే ఈ విమర్శలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నితిన్ భాయ్ పటేల్ కొట్టి పారేస్తున్నారు. మా కర్తవ్యాన్ని నిర్వహించడంలో విఫలమయ్యమనే వాదనను తాను ఏకీభవించనని చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రులలో 23వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఆస్పత్రిలోనూ వైద్య సిబ్బంది అహర్నిశలు పని చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన అత్యుత్తమ వైద్య పరికరాలను మేం వారికి అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విధంగా వైరస్ పై గుజరాత్ లో జరుగుతున్న పరిణామం. గుజరాత్ విఫలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చుట్టూ తిరుగుతోంది.