Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ సిద్ధం చేసి గుట్టుగా వేస్తున్న చైనా..

By:  Tupaki Desk   |   25 Aug 2020 7:50 AM GMT
వ్యాక్సిన్ సిద్ధం చేసి గుట్టుగా వేస్తున్న చైనా..
X
కరోనా వైరస్ చైనా దేశంలోని వుహాన్ నగరంలో పుట్టింది. ఆ తర్వాత వైరస్ దేశమంతా వ్యాపించి.. అక్కడినుంచి క్రమేణా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అయితే ఈ వైరస్ ఏ జంతువుల నుంచో పక్షుల నుంచో పుట్టింది కాదని.. దాన్నొక జీవాయుధంగానే చైనా తయారు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. యుద్ధాల కోసం దేశాలు ఆయుధాలను సమకూర్చుకోవడం అన్ని దేశాలకు పరిపాటే. అయితే అప్పటిలా బాంబులు, తుపాకుల కాలం పోయింది.

ఇప్పుడంతా అణు బాంబులు, హైడ్రోజన్ బాంబులను అన్ని దేశాలు తయారు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే చైనా ఒకడుగు ముందుకేసి వైరస్ ని ఒక ఆయుధంలా తయారు చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో చైనాలో కరోనా వైరస్ ప్రబలినప్పుడు.. అది ఎంత మహమ్మారో ఇతర ప్రపంచ దేశాలకు తెలియదు. చైనా ఈ విషయంలో ఇతర దేశాలను అప్రమత్తం చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రపంచమంతా వైరస్ వ్యాపించిన తరువాత.. ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయి. అయితే అవి ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉన్నాయి. అయితే అందరికీ షాకిస్తూ చైనా ఇప్పటికే వ్యాక్సిన్ సిద్ధం చేసిందని.. వైద్య సిబ్బంది, బోర్డర్ లో పనిచేసే అధికారులకు జూలై నుంచే వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ కూడా ప్రారంభించిందని వార్తలు వస్తున్నాయి. చైనాలో తయారు చేసిన వ్యాక్సిన్ కి ఇంకా అనుమతి రాలేదని, అయితే వైద్య సిబ్బంది, సరిహద్దు దాటుతున్న అధికారులకు అత్యవసర పరిస్థితుల్లో టీకా వేస్తున్నట్లు నేషనల్ హెల్త్ కమిషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంట్ అధిపతి ఝేన్గ్ ఝేన్గేవెయ్ తెలిపారు.

చైనా లో ప్రస్తుతం పాజిటివ్ కేసులు నమోదు కావడం లేదని, ఇతర దేశాల నుంచి వస్తున్న వారితోనే కొద్ది సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని.. అందుకే రిస్కు ఉన్న బోర్డర్ ప్రాంతంలో వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ సిద్ధమవు గానే లావోస్ థాయిలాండ్, కంబోడియా, వియత్నాం దేశాలకు ప్రాధాన్యం ఇస్తామని చైనీస్ ప్రీమియర్ లి కిఖియాంగ్ ప్రకటించారు. చైనా కారణంగానే కరోనా వైరస్ పుట్టిందని అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా వంటి అగ్ర దేశాలతో పాటు ఇతర దేశాలు ఆ దేశం పై ఆగ్రహంగా ఉన్నాయి. వ్యాక్సిన్ ముందుగా సిద్ధం చేసి అన్ని దేశాలకు దానిని అందించడం ద్వారా మళ్ళీ దగ్గరయ్యేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఇదివరకే ఫిలిఫైన్స్, ఆఫ్రికా దేశాలకు వ్యాక్సిన్ అందజేస్తామని ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ హామీ ఇచ్చారు. వైరస్ ప్రబలినప్పుడు చైనా ఎంత గుంభనంగా వ్యవహరించిందో వ్యాక్సిన్ సిద్ధమైన తర్వాత కూడా చైనా అంతే గుంభనంగా వ్యవహరిస్తోందని అంతా అంటున్నారు.