Begin typing your search above and press return to search.
కరోనా పుట్టినింట.. ఇక మాస్కు అక్కర లేదంట.. డ్రాగన్ ఉత్తర్వులు
By: Tupaki Desk | 22 Aug 2020 5:00 AM ISTకరోనా కు పుట్టినిల్లు చైనా. గత నవంబర్ లో చైనాలోని వుహాన్ నగరంలో మొట్ట మొదట కరోనా వైరస్ పుట్టింది. వేలాది మంది కరోనా బారినపడి అవస్థలు పడ్డారు. లెక్క లేనంత మంది మృతి చెందారు. ఆ దేశమంతా పాకిన కరోనా తర్వాత ప్రపంచంలోని ఇతర దేశాలకు విస్తరించింది. చైనా వైరస్ తీవ్రత ముందే తెలుసుకొని కట్టడి చర్యలు చేయడంతో ఆరు నెలల కాలంలోనే సాధారణ స్థాయికి వైరస్ ను నిరోధించింది. అయితే ఈ ముప్పు గురించి ప్రపంచ దేశాలకు అంతగా అవగాహన లేకపోవడంతో.. విదేశాలకు వెళ్లి తిరిగి స్వదేశానికి వచ్చిన వారితో కరోనా క్రమక్రమంగా అంతా విస్తరించింది. దీంతో వైరస్ కట్టడికి అన్ని దేశాలు ఉపక్రమించాయి. లాక్ డౌన్లు ప్రకటించాయి. భౌతిక దూరం పాటించడంతో పాటు..మాస్కు ధారణ తప్పని సరి చేశాయి.
ప్రస్తుతం అన్ని దేశాలు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ముమ్మరంగా పరిశోధనలు సాగిస్తున్నాయి. ప్రపంచంలో ఇప్పటివరకు ఒక్క న్యూజిలాండ్ మాత్రమే జీరో కరోనా కేసులతో పూర్తి సడలింపులు ప్రకటించింది. తాజాగా కరోనా పుట్టినిల్లయిన చైనా ఇక మాస్కులు ధరించడం అవసరం లేదని.. ప్రజలు స్వేచ్ఛగా తిరగవచ్చు..అని ప్రకటించింది. గత ఏప్రిల్ చివరి వారంలోనే చైనా రాజధాని బీజింగ్లో మాస్కులు లేకుండా అన్ని చోట్ల తిరిగేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే మళ్లీ నగరంలో పాజిటివ్ కేసులు బయటపడడంతో లాక్ డౌన్ నిబంధనలు అమల్లోకి వచ్చింది.
ప్రస్తుతం బీజింగ్ లో గత 13 రోజుల నుంచి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. బీజింగ్ కు పక్కనే ఉండే జీన్జి యాంగ్, ఇతర ప్రాంతాల్లో కూడా కోవిడ్ తీవ్రత తగ్గి పోయింది. ఈ ప్రాంతాల్లో కూడా ఐదు రోజులుగా పాజిటివ్ కేసులు లేవు. దీంతో బీజింగ్ సహా ఇతర ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు లేకుండానే బయట తిరగవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. భౌతిక దూరం, ఇతర నిబంధనలు కూడా పాటించాల్సిన అవసరం లేదని చైనా ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరోనా పుట్టిన దేశం.. కరోనా బారి నుండి పూర్తిగా కోలుకోవడం విశేషమేనని అంతా అంటున్నారు.