Begin typing your search above and press return to search.

మాస్క్ పెట్టుకోండి లేకపొతే ఫైన్ , దేశ అధ్యక్షుడికి హెచ్చరిక !

By:  Tupaki Desk   |   24 Jun 2020 3:00 PM GMT
మాస్క్ పెట్టుకోండి లేకపొతే ఫైన్ , దేశ అధ్యక్షుడికి హెచ్చరిక  !
X
ఈ మహమ్మారి దెబ్బకి ప్రతి ఒక్కరి జీవితం అతలాకుతలం అవుతుంది. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి దేశం కూడా ఈ మహమ్మారి కారణంగా ఇబ్బంది పడుతుంది. అయితే ,ఈ మహమ్మారి వచ్చిన కొత్తలో సరైన చర్యలు తీసుకోక ఇప్పుడు , దానికి తగ్గ ప్రతి ఫలం అనుభవిస్తున్న దేశం బ్రెజిల్. ఆ దేశంలో పాజిటివ్ కేసులు , మరణాల సంఖ్య పెరగడానికి ఓ రకంగా ఆ దేశ అధ్యక్షుడే కారణం. ఎందుకు అంటే అయన ఈ వైరస్ వచ్చిన కొత్త లో ఇదేం చేస్తుంది అంటూ ..అయన జాగర్తలు తీసుకోలేదు ..ప్రజలకి కూడా చెప్పలేదు.

అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పుణ్యమా అని ఐదు నెలల కిందట... అసలు వైరస్ ప్రభావం లేని ఆ దేశం... ఇప్పుడు రోజువారీ అమెరికా కంటే ఎక్కువ కేసులతో ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. నిన్న ఒక్క రోజే బ్రెజిల్‌లో 40131 కొత్త కేసులు, 1364 మరణాలూ సంభవించాయంటే... 22 కోట్ల జనాభా ఉన్న ఆ దేశాన్ని ఎంతలా వైరస్ కబళిస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో బోల్సోనారో... ప్రజల్లోకి వెళ్లి ర్యాలీలు చేస్తున్నాడు. దాని వల్ల కరోనా మరింత వ్యాపిస్తోంది. అధ్యక్షుడై ఉండి... ఆయనే మాస్క్ పెట్టుకోనప్పుడు... మేమెందుకు పెట్టుకోవాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దాంతో... బ్రెజిల్ ఫెడరల్ జడ్జి రెనాటో బోరెల్లీ... బోల్సోనారో మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ఆర్డర్ వేశారు. తన ఆదేశాన్ని పాటించక పోతే... రోజు కు రూ.29వేల ఫైన్ వేస్తానని తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా తర్వాత ఎక్కువ కేసులు (1151479), ఎక్కువ మరణాలు (52771) ఉన్న దేశం బ్రెజిలే. ఈ రెండు దేశాలూ వైరస్ ను కంట్రోల్ చేస్తే... దాదాపు 40 శాతం వైరస్ కంట్రోల్ అవుతుంది. కానీ అటు ట్రంప్, ఇటు బోల్సోనా రో ఇద్దరూ వైరస్ ను కట్టడి చెయ్యకుండా ఉంటున్నారు. ఇద్దరూ వ్యాక్సిన్ వచ్చేస్తుందనీ... ఆ తర్వాత ఈ వైరస్ పూర్తిగా అంతం అవుతుంది అని నమ్మకంగా ఉన్నారు. అయితే , ఆ వ్యాక్సిన్ వచ్చే లోపు ఎంత మంది చనిపోతారో ? ఈ రెండు దేశాల కారణంగా ఇప్పుడు మెక్సికో లో రోజువారీ కరోనా కేసులు, మరణాలూ పెరిగి పోతున్నాయి.