Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : ఏపీ సచివాలయంలో వైరస్ కలకలం !

By:  Tupaki Desk   |   30 May 2020 6:30 AM GMT
బ్రేకింగ్ : ఏపీ సచివాలయంలో వైరస్ కలకలం !
X
దేశంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలలో వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా పటిష్టంగా లాక్ డౌన్ అమలు అవుతున్నప్పటికీ కూడా వైరస్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అయితే , ఇప్పట్లో వైరస్ తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం పాలనకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు హైదరాబాద్ నుంచి ఆఘమేఘాల మీద స్పెషల్ బస్సుల్ని వేసి ఉద్యోగులను ఏపీ సచివాలయానికి రప్పించింది. ఆమరావతి చేరుకున్న తర్వాత అందరికీ కరోనా పరీక్షలు చేశారు.

అయితే, అందులో ఓ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది అని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. దీంతో ఒక్కసారిగా అమరావతి సెక్రటేరియట్ లో కలకలం రేగింది. ఉద్యోగులంతా భయాందోళనకు గురవుతున్నారు. మంగళగిరి మండలం నవులూరులోని గోలి వారి తోటలో ఉన్న ఓ అపార్ట్ మెంట్లో నివాసముంటున్న వ్యవసాయశాఖ ఉద్యోగికి కరోనా ఉన్నట్లు తేలిందని, దీనితో అధికారులు ఆందోళన చెందుతున్నారని, మఖ్యంగా ఆయనతో కలిసి సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో వచ్చిన వారికి కరోనా సోకిందేమో అన్న అనుమానంతో క్వారంటైన్ కు వెళ్లాలని చూసిస్తున్నారని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. అయితే, దీని పై ఏపీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. చూడాలి మరి ఈ వార్త పై ఏపీ ప్రభుత్వం ఏ విదంగా స్పందిస్తుందో..