Begin typing your search above and press return to search.
కరోనా భయం .. ఊరు , ఇల్లు వదిలేసి జనాలు ఎక్కడివెళ్తున్నారంటే !
By: Tupaki Desk | 15 May 2021 6:30 AM GMTకరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తుంది. సెకండ్ వేవ్ దెబ్బకి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. దేశంలో లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే వేల సంఖ్యలో కరోనా మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక ఏపీలో కూడా పరిస్థితి రోజురోజుకి మరింత ఆందోళనకర స్థాయికి చేరుకుంటుంది. కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తు , ఊళ్లలో ఉండే ఇళ్లను వదలి పొలంబాట పడుతున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువమంది వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కావడంతో రైతుల్లో చాలామందికి పొలాల వద్ద మోటారు షెడ్లు, పశువుల షెడ్లు, గుడిసెలు, కొందరికి పక్కా ఇళ్లు కూడా ఉన్నాయి. దీనితో ఈ కారణం మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో ఊర్లో కంటే పొలాల వద్ద ఉంటేనే మంచిది అని భావించి పొలం వద్దకి వెళ్లి అక్కడే ఉంటున్నారు.
ఇంట్లో వాళ్లంతా పొలం దగ్గర ఉండడంతో పొలం పనులు చక్కగా సాగుతున్నాయి. పగటిపూట వ్యవసాయపనులు, పశువులను మేపుతున్నారు. పొలాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. కొంతమంది తిరిగి సాయంత్రానికి ఇళ్లకు వెళుతున్నారు.. మరికొందరు నెలకి సరిపడా సామగ్రి తీసుకోని అక్కడే నివాసం ఉంటున్నారు. పాత రోజుల్లో కూడా గ్రామాల్లో ఇలాంటి పద్ధతులను పాటించేవారు. పొలం పనులు చేసుకోవాలనే లక్ష్యంతో పంట వేసినప్పటి నుండి పంట అయిపోయే వరకు పొలం వద్దే ఉంటూ , అక్కడే తిని , పడుకునే వారు. మళ్లి కరోనా దెబ్బకి ఆనాటి రోజులు గుర్తుకువస్తున్నాయి. రాత్రి వేళల్లో అక్కడున్న సౌకర్యాలతోనే సర్దుకుపోతున్నారు. కొందరు పాకల్లో నిద్రిస్తుండగా.. మరికొందరు మోటారు షెడ్లలో సేద తీరుతున్నారు. రెండు,మూడు వారాలుగా గ్రామాలకు దూరంగా ఉంటున్నారు. పొలాల్లోనే హాయిగా ఉంటున్నారు. అలాగే అరటి ఆకుల్లో భోజనం చేస్తూ , మంచి తెలుగింటి భోజనాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు ఇమ్మ్యూనిటీ పవర్ పెంచుకుంటున్నారు. పొలాల దగ్గర కొవిడ్ నిబంధనల్ని పాటిస్తున్నారు. సైతం సామాజిక దూరాన్ని పాటించేలా ఒకరిపొలం నుంచి మరొకరి పొలం వద్దకు వెళ్లడం లేదు. రైతులు వారి పొలాల దగ్గరే తాత్కాలికంగా ఉండడంతో పల్లెల్లో జనాల సంచారం పెద్దగా కనిపించడం లేదు. చిత్తూరు జిల్లాల్లోని చాలా గ్రామాల్లో ఇదే తరహా సన్నివేశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా కరోనా మహమ్మారి మరోసారి అందరిని పొలంబాట పట్టేలా చేసింది.