Begin typing your search above and press return to search.
కరోనాపై దుష్ప్రచారం .. ఏపీ ప్రభుత్వం ఆగ్రహం, కఠిన చర్యలకు సిద్ధం !
By: Tupaki Desk | 8 May 2021 5:36 AM GMTదేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి జోరు కొనసాగుతుంది. అలాగే ఏపీలో కూడా కరోనా వైరస్ అలజడి రోజురోజుకి పెరిగిపోతుంది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా కూడా కరోనా అదుపులోకి రావడం లేదు. అయితే, రాష్ట్రంలో వ్యాక్సినేషన్, కరోనా వ్యాప్తి పై రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. అందులో ఏది నిజం, ఏది అబద్దం అని తెలియక ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. కరోనా పై దుష్ప్రచారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
చంద్రబాబు, ఒక వర్గం మీడియా ప్రచారాలపై ఫిర్యాదులు చేస్తున్నాయి అంటూ చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించింది. దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులు, మీడియా సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. వాస్తవాలను మరుగునపరిచి, ప్రజలను తప్పుదోవపట్టించేలా వ్యాక్సినేషన్‌పై కథనాలు, ప్రచారాలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్ 440 కే వైరస్ సంక్రమించిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబుపై కూడా కేసులు నమోదయ్యాయి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా తప్పుడు ప్రచారాలు , విపత్తు సమయంలో సేవలందిస్తున్న సిబ్బంది నైతికస్థైర్యాన్ని దెబ్బతీసేలా చేస్తున్న దుష్ప్రచారాలపై ఏపీ ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకోనుంది.