Begin typing your search above and press return to search.
మోడీని జగన్ నమ్మడం లేదా.. ఏం జరుగుతోంది ?
By: Tupaki Desk | 27 April 2021 8:30 AM GMTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు .. కేంద్రంతో ఉన్న అనుబంధం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంలోని ఇద్దరు పెద్దలు.. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ఏం చెప్పినా.. జగన్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఉంటారు కూడా. ఇప్పటికే.. అనే పనులు ఆయన చేస్తున్నారు.రాజ్యసభ సీటు ఇచ్చారు. కేంద్రం తీసుకువచ్చిన అనేక వివాదాస్పద చట్టాలకు ఏమాత్రం సంకోచించకుండా మద్దతు ప్రకటించారు. ఇక, గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థను ఏపీలోకి తీసుకువచ్చారు.
కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చే ఏపీ పాడిపరిశ్రమను అమూల్‌కు అప్పగించారు. ఇక, మోడీ మిత్రులు.. అంబానీ, ఆదానీలకు ఏపీలోని పోర్టులను, కాంట్రాక్టులను కూడా జగన్ అప్పగిస్తున్నారు. ఇలా.. అనేక రూపాల్లో ఆయన కేంద్రంలోని పెద్దలకు సహకరిస్తున్నారు. అయితే.. ఇంత చేస్తున్నా..కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని జగన్ నమ్మడం లేదని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అంచనా వేస్తున్నవారు.. జగన్ వ్యవహార శైలిని చూస్తే.. మోడీపై ఆయనకు ఏమాత్రం విశ్వసనీయత లేదని కుండబద్దలు కొడుతున్నారు.
వినేందుకు, నమ్మేందుకు కూడా కొంత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమని చెబుతున్నారు., తాజాగా జరిగిన పరిణామం గమనిస్తే.. జగన్ కేంద్రంపై ఆధారపడడం లేదనే వాదన స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తు తం వ్యాక్సిన్ కొరత రాష్ట్రాన్ని తీవ్రంగా వేధిస్తోంది. కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. అదే సమయంలో మరణాలుకూడా విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ ఇవ్వాలని.. అందరికీ అందాలని జగన్ భావిస్తున్నారు. కానీ, కేంద్రం మాత్రం తక్కువ మొత్తంలోనే వ్యాక్సిన్ ఇస్తోంది.
దీంతో కేంద్రాన్ని నమ్ముకుంటే.. నట్టేటమునుగుతామని భావిస్తున్న జగన్.. తనే స్వయంగా రంగంలోకి దిగి.. సీరం సంస్థ చైర్మన్‌తో ఫోన్ లో మాట్లాడారు. మాకు వ్యాక్సిన్ ఇవ్వండి..ఎంతైనా ఫర్వాలేదు. చాలినన్ని ఇవ్వండి.. డబ్బులు కూడా వెంటనే ఇచ్చేస్తాం అని విన్నవించారు. నిజానికి ఇలాంటి ఫోన్లు ఇప్పటి వరకు ఏ రాష్ట్రం నేరుగా చేయలేదు. కానీ, జగన్ మాత్రం సీరం సంస్థకు విజ్ఞప్తి చేశారు. అంటే.. దీనిని బట్టికేంద్రాన్ని నమ్ముకుంటే ప్రయోజనం లేదని.. మన ప్రయత్నం మనం చేసుకోవాలని ఆయన డిసైడ్ అయినట్టు చెబుతున్నారు పరిశీలకులు. మరి మున్ముందు.. ఇంకెన్ని విషయాల్లో ఇలా చేస్తారో చూడాలి.