Begin typing your search above and press return to search.

సొంతంగానే ప్రయత్నాలు చేసుకుంటున్న జగన్

By:  Tupaki Desk   |   24 April 2021 10:30 AM GMT
సొంతంగానే ప్రయత్నాలు చేసుకుంటున్న జగన్
X
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్రప్రభుత్వంపై ఆధారపడితే లాభంలేదని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే టీకాలను తయారుచేస్తున్న కంపెనీలతో నేరుగా సంప్రదింపులు మొదలుపెట్టేశారు. కోవాగ్జిన్ టీకాను తయారుచేస్తున్న భారత్ బయోటెక్ కంపెనీ సీఎండి కృష్ణాఎల్లాతో ఫోన్లో మాట్లాడారు. అలాగే కరోనా వైరస్ చికిత్సకు వాడుతున్న రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను అదనంగా సరఫరా చేయాలంటు హెటిరో డ్రగ్స్ ఎండి పార్ధసారధిరెడ్డితో కూడా మాట్లాడారు.

కరోనా టీకా కోసం కేంద్రాన్ని నమ్ముకుంటే ఉపయోగం ఉండదని రాష్ట్రప్రభుత్వానికి అర్ధమైపోయినట్లుంది. ఎందుకంటే బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల విషయంలో కేంద్రం పక్షపాతంతో వ్యవహరిస్తోందనే ఆరోపణలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ విషయం మహారాష్ట్ర విషయంలో స్పష్టంగా అందరికీ తెలిసిపోయింది. కేసులు బాగా ఎక్కువున్న రాష్ట్రాల్లో డిమాండ్లకు తగ్గట్లుగా కేంద్రం టీకాలను సరఫరా చేయటంలేదు. ఇదే సమయంలో తక్కువ కేసులు నమోదవుతున్న తమ ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు టీకాలను ఎక్కువగా సరఫరా చేస్తోంది.

పైగా 18 ఏళ్ళు నిండినవారికి కూడా టీకాలు వేయించుకునే వెసులుబాటు ఇచ్చింది కేంద్రం. అయితే ఈ టీకాలకు ధరలు చెల్లించాలని కేంద్రం మెలికపెట్టింది. కేంద్రం తాజా నిర్ణయంవల్ల రోజుకు కోట్లాది టీకాలు అవసరం. ఇప్పటికే తనపై ఉన్న ఆరోపణలనుండి బయటపడలేక అవస్తలు పడుతున్న కేంద్రం టీకాలను సేకరించుకునే బాధ్యతను రాష్ట్రాలపై మోపి తాను తప్పుకుంది. ఇదే సమయంలో 18 ఏళ్ళు నిండినవారికి టీకాలను ఉచితంగా వేయాలని జగన్ డిసైడ్ చేశారు. 18 ఏళ్ళు నిండిన వారు 2 కోట్లమంది ఉన్నట్లు అంచనా. ఇందుకోసం రు. 1600 కోట్లను ప్రభుత్వం ఖర్చుపెట్టబోతోంది.

మామూలుగానే టీకాలు సరపడా అందటంలేదు. ఇలాంటి నేపధ్యంలో 18 ఏళ్ళు నిండినవారికి కూడా ఉచిత టీకాలంటే డిమాండ్ గురించి చెప్పాల్సినవసరంలేదు. ఇప్పటికే 60 లక్షల టీకాలు కావాలని జగన్ కేంద్రానికి ఇండెంట్ పెట్టున్నారు. జగన్ పెట్టిన ఇండెంట్ యధాతథంగా వచ్చే అవకాశం కూడా లేదు. ఈ పరిస్ధితుల్లో టీకాలను ఉత్పత్తిచేసే ఫర్మాకంపెనీలతో నేరుగా మాట్లాడి అవసరాలను అధిగమించాలని జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే భారత్ బయోటెక్, హెటిరో అధినేతలతో మాట్లాడారు. మరి ఫార్మాకంపెనీలు ఏ మేరకు టీకాలను సరఫరా చేస్తాయో చూడాలి.