Begin typing your search above and press return to search.
ఏపీలో కరోనా కలకలం...గ్రామాల్లో స్వీయ ఆంక్షలు, దుకాణాలు బంద్ !
By: Tupaki Desk | 12 April 2021 9:30 AM GMTదేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ చాలా వేగంగా కొనసాగుతుంది. ముఖ్యంగా గత వారం, పది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా దేశంలో దాదాపుగా రెండు లక్షలకి చేరువలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో దేశంలో మరోసారి ఆందోళన మొదలైంది. కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కూడా కరోనా అదుపులోకి రాకపోవడంతో చాలామంది మళ్లీ మునుపటి రోజులు వస్తాయని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ముందుగా గ్రామాల్లో నివశించే వారే కరోనా పై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో ఇప్పుడిప్పుడే మళ్లీ పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటం తో కరోనా నియంత్రణ విషయంలో ప్రజా చైతన్యం బాగా కనిపిస్తోంది. పాజిటివ్ కేసులు నమోదయ్యే గ్రామాల్లో స్థానికులు స్వచ్ఛందంగా తమ గ్రామంలో ఒకే చోట ఎక్కువ మంది గుమికూడకుండా ఆంక్షలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
కరోనా మహమ్మారిని అరికట్టడానికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చినా కూడా కరోనా ఏ మాత్రం తగ్గడం లేదు. దీన్ని బట్టి చూస్తే .. కరోనా నుండి మనం బయటపడాలి అంటే , ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. స్వీయ రక్షణ అనేది ఏర్పరచుకోవాలి. ప్రతి ఒక్కరూ కరోనా నియమాలని ఖచ్చితంగా పాటిస్తే కరోనా భారి నుండి మనం బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీలోని పలు గ్రామాల వాసులు ఇదే పద్దతిని ఫాలో అవుతున్నారు. గతంలో ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టిన సమయంలో గ్రామాల్లో నివశించే ప్రజలు ఏ తరహా కరోనా నియమాలని అయితే ఫాలో అయ్యారో , ఆ నియమాలని మళ్లీ అమల్లోకి తీసుకువస్తున్నారు.
గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో రెండు నెలల వ్యవధిలో 69 పాజిటివ్ కేసులు నమోదు కావడం, ఆరుగురు మరణించడంతో గ్రామస్థులు కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొల్లిపర, తూములూరులో ఈ నెల 16వ తేదీ వరకు వ్యాపార దుకాణాలు, హోటళ్లు, టీస్టాళ్లు ఉదయం 11 గంటలకే మూసి వేస్తున్నారు. స్థానిక పెద్దల వినతి మేరకు తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్‌ఐలతో కూడిన మండల కమిటీ దీనికి ఆమోదం తెలిపింది. అతి తక్కువ మంది గుమ్మిగూడేలా చేసుకుంటూ వ్యాపారాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. తెనాలి మండలం పెదరావూరు, అంగలకుదురు, కటివరం గ్రామ పంచాయతీలలోనూ సోమవారం నుంచి ఈనెల 27వ తేదీ వరకు వ్యాపార, వాణిజ్య సముదాయాల కార్యకలాపాలను ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించుకునేలా ఆంక్షలు అమలు చేసుకుంటున్నారు. భట్టిప్రోలు మండలంలోని నాలుగు గ్రామాల్లో కూడా ఇదే తరహా ఆంక్షలు విధించుకున్నారు. ఈ కొన్ని గ్రామాలే కాదు రాష్ట్రంలోని చాలా గ్రామాలు ఈ తరహా ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నాయి.