Begin typing your search above and press return to search.
ఇకపై మాస్క్ లేకపోతే నో ఎంట్రీ: ఏపీఎస్ ఆర్టీసీ
By: Tupaki Desk | 27 March 2021 4:46 AM GMTదేశంలో కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పింది. పలు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తగ్గినట్లే తగ్గిన వైరస్ కొన్నిరోజుల నుంచి విజృంభిస్తోంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. అంతేకాకుండా ఏపీఎస్ ఆర్టీసీ వైరస్ ను దృష్టిలో పెట్టుకొని కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు చేపట్టింది. అందుకే బస్సు ఎక్కాలంటే మాస్క్ తప్పనిసరి అని ఏపీఎస్ఆర్టీసీ ఆదేశించింది. మాస్క్ లేకపోతే బస్ లోకి నో ఎంట్రీ అని తేల్చి చెప్పింది.
నిత్యం శానిటైజ్
ఏపీలోని అన్ని బస్టాండ్లలో నిత్యం శానిటైజర్ అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. బస్సులు, ప్రయాణ ప్రాంగణాలను నిత్యం శానిటైజ్ చేయాలని ఆదేశించింది. దాదాపు అన్ని బస్టాండ్లలో మాస్క్ లు విక్రయించనున్నట్లు ప్రకటించింది. డ్రైవర్లు - కండక్టర్లు - ఇతర ఆర్టీసీ సిబ్బంది తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని తేల్చిచెప్పింది.
అన్ని శాఖలు అప్రమత్తం
మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కరోనా నిబంధనలు విధిగా పాటించాలని, వైరస్ ను ఎదుర్కొవడానికి ఏపీ సర్కార్ అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించడం పట్ల అలక్ష్యం వహించకూడదని తేల్చిచెప్పింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కొవిడ్ కేసులు పెరిగిన వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యారోగ్య శాఖ మరోసారి సూచించింది.
పాటించాల్సిందే
ఆర్టీసీ బస్సుల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి అని ఇప్పటికే నిబంధనలు ఉన్నా.. అందరూ వాటిని గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ సిబ్బంది సైతం పెద్దగా పట్టించుకోలేదని తెలిపింది. కానీ ప్రస్తుతం వైరస్ ఉద్ధృతి పెరిగిన నేపథ్యంలో నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది.