Begin typing your search above and press return to search.
ఏపీలో రేపటి నుండి కరోనా వ్యాక్సిన్ ‘డ్రై రన్’
By: Tupaki Desk | 26 Dec 2020 9:51 AM GMTఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఏపీతో పాటు పంజాబ్, అసోం, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన డ్రై రన్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించడంతో.. అందుకు తగ్గట్టుగా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కరోనా కట్టడిలో ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం మరో బాధ్యత అప్పగించింది. కోవిడ్ వాక్సిన్ ‘డ్రై రన్’కి ఎంపిక చేసిన నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పేరు చేర్చించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో వాక్సిన్ ట్రయిల్ రన్ కు కృష్ణా జిల్లా అధికారులు సన్నద్ధమౌతున్నారు.
కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ఆదివారం నుంచి మూడు రోజులు నిర్వహిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. 27న ఐటీ రిలేటెడ్ డ్రై రన్, 28న లాజిస్టిక్ రిలేటెడ్ మాక్ డ్రిల్, 29న వాక్సినేషన్ ట్రయిల్ రన్ నిర్వహిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో కొ-విన్ అప్లికేషన్ పనితీరును పరిశీలిస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారి వివరాలను నమోదు చేయనున్నారు. డ్రై రన్ కోసం జిల్లాలోని ఐదు ప్రాంతాలు ఎంపిక చేశామన్నారు జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ సుహాసిని. విజయవాడ ప్రభుత్వాస్పత్రి, ఉప్పులూరు పీహెచ్ సీ, విజయవాడ పూర్ణ ప్రైవేట్ ఆస్పత్రి, ప్రకాష్ నగర్ అర్బన్ పీహెచ్ సీ, తాడిగడప ప్రభుత్వ పాఠశాలలో డ్రైరన్ కు ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ తరహాలో వ్యాక్సిన్ డ్రై రన్ కు ఏర్పాట్లు చేశామని.. మాక్ డ్రిల్ మాదిరిగానే డ్రై రన్ నిర్వహిస్తామన్నారు.
పోలింగ్ కేంద్రం తరహాలోనే ఎంట్రీ, ఎగ్జిట్ ఉంటుందని.. ప్రతీ కేంద్రంలో 25 మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేసినట్లుగా ట్రైల్ రన్ నిర్వహిస్తామన్నారు. ఈ డ్రై రన్ ద్వారా వైద్య,ఆరోగ్య సిబ్బందికి అవగాహన ఏర్పడనుంది. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ట్రైల్ రన్ కోసం పంజాబ్, అస్సాం, గుజరాత్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం ఎంపిక చేసింది. వ్యాక్సిన్ డ్రై రన్ ఎలా నిర్వహించాలో కేంద్రం ప్రత్యేక సూచనలు చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ ట్రైల్ రన్ కోసం మన రాష్డ్రంలో కృష్ణా జిల్లాను ఎంపికచేశారు.